Advertisementt

బాలయ్యకు షాకిచ్చిన వెంకీ

Fri 17th Jan 2025 09:37 PM
daku maharaj  బాలయ్యకు షాకిచ్చిన వెంకీ
Venky shocked Balayya బాలయ్యకు షాకిచ్చిన వెంకీ
Advertisement
Ads by CJ

డాకూ మహారాజ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం !

ఈ సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహారాజ్, వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. అయితే గేమ్ ఛేంజర్ మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెనుకబడిపోయింది. డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. డాకూ మహారాజ్ నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలి 72 గంటల్లోనే రూ.106 కోట్ల కలెక్షన్లను సాధించి డాకూ మహారాజ్ రికార్డును బద్ధలు కొట్టింది.

కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నాం వైపే ఆకర్షితులవ్వడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. మరోవైపు, డాకూ మహారాజ్ కూడా ప్రత్యేక అర్థరాత్రి షోలు ద్వారా కలెక్షన్లను గట్టిగా పుంజుకుంటోంది. కానీ తెలంగాణలో థియేటర్ల సమస్య కలెక్షన్లపై ప్రభావం చూపింది.

వెంకీ సైంధవ్ ఫ్లాప్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం విశేషం. అనిల్ రావిపూడి కామెడీ మేజిక్ ఈ సినిమాను విజయవంతం చేసింది. సంక్రాంతి సీజన్‌లో వీటి పోటీ హాట్ టాపిక్‌గా మారింది.

Venky shocked Balayya:

Sankranti Vastunnam vs Daku Maharaj

Tags:   DAKU MAHARAJ
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ