Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్

Thu 09th Jan 2025 10:13 AM
sankranthi  ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్
Sankranti treat for Prabhas fans ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. రాజా సాబ్ కి సంబందించి 4 పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఇక తెలుగు వాళ్లకు అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రభాస్ సినిమాల నుంచి ఏదైనా అప్ డేట్ ఆశిస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. అది రాజా సాబ్ నుంచే ఉండొచ్చు అనేది తెలిసిన విషయమే. ఆ చిత్రమొక్కటే షూటింగ్ పూర్తి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్-మారుతి కలయికలో ఏప్రిల్ లో విడుదల కాబోతున్న రాజా సాబ్ నుంచి సంక్రాంతి ట్రీట్ సిద్దమవుతుందట. 

భోగి రోజు కానీ, లేదంటే పెద్ద పండుగ సంక్రాంతి రోజు కానీ ఆ ట్రీట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. సో గత ఏడాది ఇదే పండుగకి రాజా సాబ్ నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, మరి ఈసారి రాజా సాబ్ టీజర్ వస్తుందేమో చూడాలి. 

Sankranti treat for Prabhas fans:

A special treat for Prabhas fans on Sankranthi

Tags:   SANKRANTHI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ