Advertisementt

పుష్ప 2: ఆ సీక్వెన్స్ వేరే లెవల్

Tue 12th Nov 2024 07:12 PM
pushpa 2  పుష్ప 2: ఆ సీక్వెన్స్ వేరే లెవల్
Pushpa 2 Jathara Episode: A Masterpiece పుష్ప 2: ఆ సీక్వెన్స్ వేరే లెవల్
Advertisement
Ads by CJ

పుష్ప మ్యానియా మొదలయ్యే సమయం ఆసన్నమైంది. నవంబర్ 17 పాట్నా నుంచి అసలు విషయం మొదలు కాబోతుంది. ఈ 17 న పుష్ప ద రూల్ ట్రైలర్ రాబోతుంది. ఇప్పటికే భీభత్సమైన అంచనాలున్న పుష్ప 2 షూటింగ్ విషయంలో సుకుమార్ మరియు అల్లు అర్జున్ పరుగులు పెడుతున్నారు. ఓ పక్క షూటింగ్ కంప్లీట్ చెయ్యాలి, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్, ఇంకోపక్క ప్రమోషన్స్ . 

అంతా గందరగోళంగా కనిపిస్తున్న సమయంలో పుష్ప ద రూల్ పై కొన్ని వార్తలు చదివితే గూస్ బంప్స్ రావడమైతే పక్కా అనిపిస్తుంది. మొదటి నుంచి పుష్ప 2 లో జాతర సీక్వెన్స్ వేరే లెవల్ అంటూ మాట్లాడుతున్నారు. నిజమే పుష్ప 2 లో జాతర సీక్వెన్స్ 15 నుండి 18 నిమిషాల పాటు ఉండబోతుందట. 

ఈ సీక్వెన్స్ ఎపిసోడ్ కోసం మైత్రి మూవీస్ మేకర్స్ అక్షరాలా 60 కోట్లు ఖర్చు పెట్టారట. ఫైట్ సీక్వెల్ కోసం 60 కోట్లు ఖర్చుపెడితే.. ఫైట్ రిహార్సల్స్ కోసం దాదాపు 14 కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. రెండు నెలల పాటు చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైట్ మాస్టర్లు పనిచేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్, ఫ్రీ క్లైమాక్స్ రెండూ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటున్నారు. 

Pushpa 2 Jathara Episode: A Masterpiece:

Pushpa 2: Highlights revealed

Tags:   PUSHPA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ