Advertisementt

బిగ్ బాస్ 8: నాగార్జున ఉగ్ర రూపం

Sat 02nd Nov 2024 06:29 PM
nagarjuna  బిగ్ బాస్ 8: నాగార్జున ఉగ్ర రూపం
Bigg Boss 8: Nagarjuna fires on housemates బిగ్ బాస్ 8: నాగార్జున ఉగ్ర రూపం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 8 లో వీక్ మిడిల్ లో ఎలా ఉన్నా వారంతాపు ఎపిసోడ్స్ లో మాత్రం కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూనే వారిని హెచ్చరించడం మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది. టాస్క్ లలో హౌస్ మేట్స్ ఎవరైనా అదుపు తప్పితే వారాంతపు ఎపిసోడ్ అందులోను శనివారం నాడు నాగార్జున వారికి క్లాస్ పీకుతూ ఎడా పెడా ఇచ్చి పడేస్తుంటారు. 

మరి ఈ వారం నాగార్జున చేతిలో బుక్ అయ్యింది ఎవరంటే.. ప్రేరణ. ఆటలో ఆరితేరిపోయి కనిపించే ప్రేరణ హావ భావాలు కొంతమంది హౌస్ మేట్స్ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ వారం జరిగిన వాటర్ టాస్క్ లో ప్రేరణ మాట్లాడిన మాటలకి నాగ్ ఫైర్ అయ్యారు. అంతేకాదు అదే టాస్క్ లో నిఖిల్ అదుపు తప్పి మాట్లాడిన మాటలకూ నాగార్జున ఉగ్ర రూపం చూపించారు. 

ఇక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గౌతమ్ విషయంలో నాగార్జున హౌస్ మేట్స్, అలాగే ఆడియన్స్ ను అడిగి మరీ అతని తప్పును ఎత్తి చూపించిన ప్రోమో వదిలారు. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెంతమంది పై నాగార్జున ఫైర్ అవుతారో అనేది నైట్ 9 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. 

Bigg Boss 8: Nagarjuna fires on housemates:

Bigg Boss 8: Nagarjuna promo viral

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ