Advertisementt

నన్ను తిట్టుకుంటున్నారు: రష్మిక

Thu 31st Oct 2024 06:43 PM
rashmika mandanna  నన్ను తిట్టుకుంటున్నారు: రష్మిక
Rashmika about telugu movies నన్ను తిట్టుకుంటున్నారు: రష్మిక
Advertisement

రష్మిక మందన్న నేషనల్ క్రష్ అనే పేరుకు సార్ధకత తీసుకొస్తోంది. పలు లాంగ్వేజెస్ లో బిజీ అయిన రష్మిక మందన్న ముఖ్యంగా నార్త్ లో మాత్రం పాతుకుపోతుంది. అక్కడ క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఇప్పుడు రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో సౌత్ స్టార్స్ తో జోడి కడుతుంది. పుష్ప ద రూల్, కుబేర చిత్రాల్లోనే కాదు హిందీలో సల్మాన్ లాంటి స్టార్ హీరో కి జోడిగా మారింది. 

తనకి తనలా ఉండడమే ఇష్టమన్న రష్మిక.. అందుకే అభిమానులు తనని ఎక్కువగా లైక్ చేస్తారని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కానీ.. ఇప్పుడు ఆ ధోరణి మారుతుంది అంటూ మాట్లాడిన రష్మిక మందన్న ప్రతిభ ఉంటే ఎక్కడైనా ఆదరణ ఉంటుంది అని చెబుతుంది. 

అయితే హిందీ అలాగే ఇతర భాషలపై దృష్టి సారించడం వలన తెలుగు అవకాశాలు వస్తున్నా వదులుకోవాల్సి వస్తుంది, దానితో నా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని చూపిస్తున్నారు. కొంతమంది తిట్టుకుంటున్నారు. అదంతా వారి ప్రేమే.. నా మీద ద్వేషం కాదు, నేను వీలైనన్ని తెలుగు సినిమాలు చెయ్యాలనేది వారి కోరిక నేను అర్ధం చేసుకోగలను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. 

Rashmika about telugu movies:

Rashmika Mandanna about telugu movie offers

Tags:   RASHMIKA MANDANNA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement