Advertisementt

రాజా సాబ్.. లక లక లక

Thu 24th Oct 2024 08:15 AM
the raja saab,motion poster  రాజా సాబ్.. లక లక లక
The Motion Poster Of The Raja Saab Released రాజా సాబ్.. లక లక లక
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ రాజా సాబ్. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ నుండి వస్తున్న అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుండి ఓ మోషన్ పోస్టర్‌ను వదిలారు. ఇది ప్రభాస్‌లోని మరో కోణాన్ని తెలియజేస్తోంది. చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ ఎలా అయితే కనిపించారో.. అలా ఈ మోషన్ పోస్టర్‌లో ప్రభాస్ మేకోవర్ అయ్యారు.

ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదనే విధంగా ఈ మోషన్ పోస్టర్ ఉంది. కింగ్ అవతార్‌లో చేతిలో సిగార్‌తో ప్రభాస్‌ని ఇలా చూసిన వారెవరైనా అయ్యబాబోయ్ అనాల్సిందే. అసలు ప్రభాసేనా? మారుతి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్లుగా ఈ పోస్టర్ చూసిన వారంతా మాట్లాడుకుంటుండటం విశేషం. ఎందుకంటే ఆయన కూర్చున్న తీరు, ఆ సింహాసనం చూస్తుంటే.. భూతాల మాంత్రికుడిలా ప్రభాస్ కనిపిస్తున్నారు. అందులోనూ రాజసం ఉట్టిపడుతుండటమనేది ప్రభాస్ గ్రేట్‌నెస్‌గా చెప్పుకోవచ్చు. 

మొట్టమొదటి సారి ఓ హర్రర్ ఫిల్మ్‌లో ప్రభాస్ నటిస్తోన్న ఈ రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మోషన్ పోస్టర్‌తో ఈ సినిమాపై అందరిలో మరింతగా క్యూరియాసిటీ పెరుగుతోంది.

The Motion Poster Of The Raja Saab Released:

Prabhas Shocks Everyone with The Raja Saab Motion Poster

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ