Advertisementt

దేవర సక్సెస్-ముంబై ఫ్లైట్ ఎక్కిన ఎన్టీఆర్

Sat 19th Oct 2024 04:37 PM
jr ntr  దేవర సక్సెస్-ముంబై ఫ్లైట్ ఎక్కిన ఎన్టీఆర్
Jr NTR back in Mumbai for War 2 shooting దేవర సక్సెస్-ముంబై ఫ్లైట్ ఎక్కిన ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన దేవర 1 చిత్రం విపరీతమైన నెగిటివిటీని దాటుకుని 500 కోట్లకు పైగా కొల్లగొట్టడం వెనుక ఉన్నది కేవలం ఎన్టీఆర్ అభిమానులే అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. అందుకే వారికి వీలున్నప్పుడల్లా కృతఙ్ఞతలు తెలుపుతూ ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోను అంటూ ఎమోషనల్ అవుతున్నారు. 

దేవర హిట్ అవడంతో దేవర థియేట్రికల్ రైట్స్ దక్కించుకుని లాభపడిన సితార నిర్మాత నాగవంశీ రీసెంట్ గానే దుబాయ్ వేదికగా దేవర సక్సెస్ పార్టీ ని ఓ రేంజ్ లో నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ కూడా దేవర సక్సెస్ పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం దేవర హవా ముగియడం.. ఆయనకు వార్ 2 నుంచి కబురు రావడంతో ఎన్టీఆర్ ముంబై వెళ్లేందుకు రెడీ అయ్యారు. 

ఈరోజు ఎన్టీఆర్ ముంబై వెళుతూ బేగం పేట ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. క్యాజువల్ గా కనిపించినా ఎన్టీఆర్ స్టయిల్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ ముంబై వెళ్లి అక్కడ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ రాగానే హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్యన క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నట్లుగా సమాచారం. 

సో కొద్దిరోజులపాటు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబై లోనే ఉంటారు. ఆ తర్వాత అంటే జనవరి నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లోకి వెళతారు. 

Jr NTR back in Mumbai for War 2 shooting:

NTR joined WAR 2 shoot in Mumbai

Tags:   JR NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ