Advertisementt

వార్ 2 తెలుగు టైటిల్ అదేనా..

Sat 19th Oct 2024 02:18 PM
war 2  వార్ 2 తెలుగు టైటిల్ అదేనా..
War 2 telugu title fixed వార్ 2 తెలుగు టైటిల్ అదేనా..
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం వార్ 2. హిట్ ఫ్రాంచైసీగా గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రం పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సెట్స్ లోకి వెళ్ళిపోయి తన పాత్రకు సంబందించి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసాడు. 

నవంబర్ లో ఎన్టీఆర్ మళ్లీ వార్ 2 సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. అప్పుడు హృతిక్-ఎన్టీఆర్ కాంబోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తారని, అది వేరే లెవల్ లో ఉండబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు వార్ 2 కి సంబంధించి ఓ తెలుగు టైటిల్ పెట్టబోతున్నారట మేకర్స్. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి, అందుకే తెలుగు టైటిల్ పై మేకర్స్ స్పెషల్ గా ఆలోచించారట. 

వార్ 2 – యుద్ధ భూమి అనే టైటిల్ ని తెలుగు ప్రేక్షకుల కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. వార్ 2 సెట్స్ మీదకి వెళ్లకముందే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని యుద్ధ భూమిలో కలుద్దామంటూ వేసిన ట్వీట్ కి ఇప్పుడు ఈ టైటిల్ కి సరిగ్గా సరిపోవడంతో అందరూ తెలుగులో వార్ 2 - యుద్దభూమిగా విడుదలవడం పక్కా అంటున్నారు.  

War 2 telugu title fixed:

War 2 update

Tags:   WAR 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ