Advertisementt

వెనక్కి తగ్గుతున్న వెంకటేష్

Wed 16th Oct 2024 01:08 PM
venkatesh  వెనక్కి తగ్గుతున్న వెంకటేష్
Venkatesh is leaving Sankranti race వెనక్కి తగ్గుతున్న వెంకటేష్
Advertisement
Ads by CJ

ముందు నుంచి సంక్రాంతి కి సినిమా రిలీజ్ అన్నవారు వెనక్కి తగ్గుతుంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది హీరోలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ముందు నుంచి చెబుతూ వచ్చిన మెగాస్టార్ చిరు విశ్వంభర ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా సంక్రాంతి బాక్సాఫీసు బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడో సినిమా సంక్రాంతి వస్తున్నామనే టైటిల్ తో సినిమా మొదలు పెట్టిన వెంకటేష్ ముందు నుంచే సంక్రాంతికి వస్తున్నామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రేస్ లోకి రావడం, అటు సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వెంకటేష్-అనిల్ రావిపూడి లు సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గుతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఒకవేళ ఎలాంటి కారణాలతో అయినా వెంకీ-అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామని చిత్రం గనక తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి నాగ చైతన్య తండేల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 

Venkatesh is leaving Sankranti race:

Venkatesh-Anil Ravipudi Film retreating from the Sankranti race

Tags:   VENKATESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ