Advertisementt

చిరు తగ్గారు.. చరణ్ డిసైడ్ అయ్యాడు

Thu 10th Oct 2024 01:30 PM
game changer  చిరు తగ్గారు.. చరణ్ డిసైడ్ అయ్యాడు
Chiru was reduced.. Charan decided చిరు తగ్గారు.. చరణ్ డిసైడ్ అయ్యాడు
Advertisement
Ads by CJ

2025 సంక్రాతి రేస్ అప్పుడే డిసైడ్ అయినట్లుగానే కనిపిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభర ను జనవరి 10 రిలీజ్ అన్నప్పటికి.. ఇప్పుడది మార్చ్ చివరి వారం లోకి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దానితో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి దించే ప్లాన్ లో మేకర్స్ ఉంటారంటున్నారు. అలా సంక్రాంతి మూవీస్ లిస్ట్ లోకి గేమ్ ఛేంజర్ తో పాటుగా వెంకీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. 

మరి బాలకృష్ణ-బాబీ NBK 109 ఇంకా కొన్ని సినిమాలు అసలు సంక్రాంతి రేస్ లో ఉన్నాయా లేదంటే వేరే డేట్స్ చూసుకుంటయా అనేది తెలియాల్సి ఉంది. కానీ సంక్రాంతి దగ్గరకొచ్చే కొద్దీ బాక్సాఫీసు బరి టైట్ అవ్వడం మాత్రం పక్కా. ప్రస్తుతం తండ్రి చిరు తప్పుకోవడంతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను దించే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్. 

దిల్ రాజుకి అసలే సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సో డిసెంబర్ ని వదిలి సంక్రాంతికి గేమ్ ఛేంజర్ వెళ్లినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. చూద్దాం ఆ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో అనేది. 

Chiru was reduced.. Charan decided:

Game Changer Takes Over Sankranti!

Tags:   GAME CHANGER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ