ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Konda Surekha reaction to the case filed by Nag

నాగ్ పెట్టిన కేసుపై కొండా సురేఖ రియాక్షన్

అక్కినేని ఫ్యామిలీ పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన నీచమైన కామెంట్స్ పై అక్కినేని ఫ్యామిలీ ఘాటుగా స్పందించింది. నాగార్జున దగ్గర నుంచి అమల, చైతు, అఖిల్ అందరూ కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగ్ ఫ్యామిలీ కి సపోర్ట్ గా నిలిచింది కొండా సురేఖ పై ఫైర్ అయ్యింది. 

ఇక సమంత కు సారీ చెప్పిన కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ విషయంలో కామ్ గా ఉంది. నాగార్జున ఊరుకుంటారా కొండా సురేఖ పై లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యారు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖ పై పరువు నష్టం కేసు పెట్టారు. ఈ రోజు నాగ్ పెట్టిన కేసుపై కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

తాజాగా కొండా సురేఖ ను నాగార్జున పెట్టిన పరువు నష్టం కేసు పై స్పందించమని కోరిన మీడియా తో కొండా సురేఖ.. ఆ ఇష్యు పై ఇక మాట్లాడను, మాట్లాడాల్సింది అంతా నిన్న మాట్లాడేశాను, దానిని ఇంకా పొడగించకండి అంటూ నాగార్జున వేసిన పరువు నష్టం కేసుపై స్పందించేందుకు మంత్రి కొండా సురేఖ నిరాకరించింది. 

Nagarjuna files complaint against Telangana minister Konda Surekha

Konda Surekha reaction to the case filed by Nag
nagarjuna
Advertisement
Advertisement