Advertisementt

దేవర షో చూసిన రాజమౌళి ఫ్యామిలీ

Fri 27th Sep 2024 12:59 PM
ss rajamouli  దేవర షో చూసిన రాజమౌళి ఫ్యామిలీ
Rajamouli family watched Devara movie దేవర షో చూసిన రాజమౌళి ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాలుగు చిత్రాలు చేసి సూపర్ హిట్స్ కొట్టిన రాజమౌళి ని ఎన్టీఆర్ ఏంతో ప్రేమతో జక్కన్నా అని పిలుచుకుంటాడనే విషయం అందరికి తెలిసిందే. రాజమౌళి కూడా ఎన్టీఆర్ పై అంతే ప్రేమ చూపిస్తారు. ఎన్టీఆర్ మొదటినుంచి రాజమౌళి ఫ్యామిలీతో మంచి ర్యాపొ మైంటైన్ చేస్తాడు.  

ఎన్టీఆర్ ను ఆర్.ఆర్.ఆర్ తో వరల్డ్ వైడ్ ప్రేక్షకులకు రాజమౌళి పరిచయం చేసారు. దానితో ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ స్టేటస్ దక్కింది. తాజాగా ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. రాజమౌళి కూడా స్పెషల్ గా దేవర చిత్రాన్ని ఫ్యామిలితో కలిసి వీక్షించారు. 

ఈమధ్యనే రెన్నోవేట్ చేసిన బాలానగర్ విమల్ థియేటర్ లో రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి దేవర ను వీక్షించేందుకు వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి ఆయన కొడుకు కార్తీకేయ, భార్య పూజ, రాజమౌళి భార్య రమ, కీరవాణి కొడుకులు అంతా కలిసి దేవర ను విమల్ థియేటర్ చూస్తూ సందడి చేసారు. 

Rajamouli family watched Devara movie:

SS Rajamouli watched JR NTR Devara with family

Tags:   SS RAJAMOULI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ