Advertisementt

బిగ్ బాస్ 8: ఈవారం నామినేషన్స్ లిస్ట్ లీక్

Mon 23rd Sep 2024 08:13 PM
bigg boss telugu 8  బిగ్ బాస్ 8: ఈవారం నామినేషన్స్ లిస్ట్ లీక్
Bigg Boss 8: Nominations list leaked this week బిగ్ బాస్ 8: ఈవారం నామినేషన్స్ లిస్ట్ లీక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 మూడు వారాలు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. మూడు వారాల్లో హౌస్ లో ఉన్న 14 మంది లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, ఈ వారం స్ట్రాంగ్ అనుకున్న అభయ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం నామినేషన్స్ కూడా హౌస్ మేట్స్ మధ్యన అగ్గి రాజేసింది. 

ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నట్టుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి. సోమవారం రాత్రి జరగబోయే నామినేషన్స్ లో ఉన్న 11 మంది మద్యన నామినేషన్స్ చిచ్చు మాములుగా లేదు. యష్మి అయితే సోనియా ని వదలకుండా ఈవారం కూడా నిఖిల్-పృథ్వీ విషయంలో నామినేట్ చేసింది. అంతేకాదు యష్మి గత వారం చెప్పినట్టుగా నాగమణికంఠను ప్రతి వారం నామినేట్ చేస్తాను అన్నట్టుగా ఈవారం కూడా అతన్ని నామినేట్ లో పెట్టింది. 

విష్ణు ప్రియా-ప్రేరణ మధ్యన నాగార్జున గుడ్లు తినిపించి ప్యాచప్ చేసినా.. విష్ణు ప్రియా ఈవారం ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ మాత్రం నైనికా, నాగమణికంఠలను నామినేట్ చేసింది. ఇక వారం నామినేషన్స్ లో సోనియా vs నబిల్ అన్నట్టుగా పెద్ద గొడవే జరిగింది. ఫైనల్ గా ఈ వారం నబీల్, ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్వీ, సోనియా, నాగమణికంఠ ఉండగా.. మరో కంటెస్టెంట్ నైనికను నిఖిల్ సేవ్ చేసినట్టుగా తెలుస్తుంది. 

Bigg Boss 8: Nominations list leaked this week:

Bigg Boss Telugu 8: Nabeel Spews Fire On Soniya

Tags:   BIGG BOSS TELUGU 8
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ