Advertisementt

పరారీలో జానీ మాస్టర్

Wed 18th Sep 2024 04:30 PM
johnny master  పరారీలో జానీ మాస్టర్
Johnny Master escaped from the police పరారీలో జానీ మాస్టర్
Advertisement
Ads by CJ

కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కీలకమలుపు తిరిగింది. లేడీ కొరియాగ్రాఫర్ పెట్టిన కేసు కింద పోలీసులు జానీ పై మూడు సెక్షన్స్ కింద కేసు నమోదు చెయ్యడమే కాదు ఇపుడు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. దానితో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

గత రెండు రోజులుగా జానీ మాస్టర్ లేడీ కొరియాగ్రాఫర్ ని వేధించిన కేసు కలకలం సృష్టిస్తుండగా.. జానీ మాస్టర్ మాత్రం ఎవ్వరికి అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ప్రస్తుతం పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలుగా విడిపోయి వెతుకులాట మొదలు పెట్టారు. 

జానీ మాస్టర్ నార్త్ ఇండియా లో అంటే లటాక్ లో ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపు జానీ మాస్టర్ పోలీసులను బురిడీ కొట్టి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. దానితో జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.  

Johnny Master escaped from the police:

Case Filed On Choreographer Johnny master

Tags:   JOHNNY MASTER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ