తనని బలవతం చేశాడంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పెట్టిన కేసు ఇప్పుడు జానీ మాస్టర్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకునేలా చేసింది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు ప్రముఖ కొరియా గ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. గతంలోనూ జానీ మాస్టర్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి.
2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్ ఆతరవాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జానీ పర్యటించాడు. జనసేన తరపున మాట్లాడే జానీ పై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదయ్యింది. దానితో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అని ఈరోజు ఉదయం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జానీ ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఇకపై జనసేన పార్టీకి జానికి ఎలాంటి సంబంధం ఉండబోదని జనసేన నుంచి ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.
జానీ మాస్టర్ పై జనసేన పార్టీ ఇమ్మిడియట్ గా యాక్షన్ తీసుకోవడం పట్ల పలువురు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నారు.




పట్టు పరికిణీలో శ్రీలీల ట్రెడిషనల్ లుక్ 

Loading..