Advertisementt

నాగార్జున ఎపిసోడ్స్ కూడా చప్పగానే!!

Mon 09th Sep 2024 05:05 PM
nagarjuna  నాగార్జున ఎపిసోడ్స్ కూడా చప్పగానే!!
Nagarjuna episodes are also bland!! నాగార్జున ఎపిసోడ్స్ కూడా చప్పగానే!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 పై ఎలాంటి అంచనాలు లేకుండానే సెప్టెంబర్ 1 న మొదలై అప్పుడే వారం పూర్తి చేసుకుందని. హౌస్ లో మొదటి ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. సోషల్ మీడియా ఫిగర్స్ vs సీరియల్ ఫిగర్స్ అన్నట్టుగా ఈ సీజన్ కనిపిస్తుంది. స్టార్ మా సీరియల్ స్టార్స్ అంతా బిగ్ బాస్ 8 లోనే కనిపిస్తున్నారు. 

మొదటి వారానికే బోర్ కొట్టేసిన ఈ సీజన్ కనీసం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయనుకుంటే అవి కూడా చప్పగా నీరసాన్ని తెప్పించేశాయి. శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చారు. హౌస్ మేట్స్ తో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడించారు. వాళ్ళని వార్న్ చేసే విషయంలోనూ నాగార్జున ఆచి తూచి వ్యవహరించారు. 

కంటెస్టెంట్స్ లో జోష్ లేదు, నాగార్జున లో మునుపటి ఉత్సాహం కనిపించలేదు అనేమాట ఆడియన్స్ నుంచి వినిపిస్తుంది. ఇక మొదటిగా హౌస్ నుంచి బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ లోను పస లేదు. కిచెన్ లో ఉండే వారే ఎక్కువగా ఎలిమినేట్ అవుతూ ఉంటారని బేబక్క మరోసారి నిరూపించింది. 

Nagarjuna episodes are also bland!!:

Bigg Boss Telugu 8 weekend review

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ