Advertisementt

డేట్ చెప్పి మరీ మొదలు పెట్టిన ఎన్టీఆర్-నీల్

Fri 09th Aug 2024 01:13 PM
ntr  డేట్ చెప్పి మరీ మొదలు పెట్టిన ఎన్టీఆర్-నీల్
NTR-Prashanth Neel project launched traditionally డేట్ చెప్పి మరీ మొదలు పెట్టిన ఎన్టీఆర్-నీల్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరపురాని రోజు. ఎన్టీఆర్-నీల్ కాంబో అఫీషియల్ గా మొదలైపోయింది. ఈరోజు ఆగష్టు 9 శ్రావణ శుక్రవారం రోజున ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో చాలా సింపుల్ గా సంప్రదాయపద్ధతిలో జరిగిపోయింది. 

తన సినిమా ఓపెనింగ్ పూజలో భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ పాల్గొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కుటుంబ సభ్యులతో సహా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖులైన దిల్ రాజు, హర్షిత్ ఇంకా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హజరైన ఈ ఓపెనింగ్ కార్యక్రంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమెరా స్విచాన్ చేసారు. 

ఎన్టీఆర్-నీల్ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన రోజే తమ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్. జనవరి 9 2026 అంటూ ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ చెప్పి మరీ పూజా కార్యక్రమాలతో సినిమాలు మొదలు పెట్టింది ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో. 

NTR-Prashanth Neel project launched traditionally:

NTR-Prashanth Neel film launched grandly

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ