Advertisementt

డబుల్ ఇస్మార్ట్: పోలీస్ బ్రెయిన్-విలన్ బ్రెయిన్

Sun 04th Aug 2024 08:18 PM
double ismart  డబుల్ ఇస్మార్ట్: పోలీస్ బ్రెయిన్-విలన్ బ్రెయిన్
Double iSmart Trailer Review డబుల్ ఇస్మార్ట్: పోలీస్ బ్రెయిన్-విలన్ బ్రెయిన్
Advertisement

ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరి జగన్నాధ్-హీరో రామ్ మాస్ ఆడియన్స్ ని రఫ్ఫాడించారు. ఇప్పుడు అదే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో మరో సరి దడదడ లాడించేందుకు సిద్ధమయ్యారు. ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి ట్రైలర్ వదిలారు. 

ఇస్మార్ట్ శంకర్ లో గల్లీ రౌడీకి పోలీస్ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే.. ఇక్కడ డబుల్ ఇస్మార్ట్ లో విలన్ బ్రెయిన్ ని శంకర్ కి ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యడం అనే కాన్సప్ట్ తో డబుల్ ఇస్మార్ట్ ని కూసింత గ్లామర్ గాను, మరికాస్త యాక్షన్ తోనూ దర్శకుడు పూరి ట్రైలర్ కట్ లో చూపించారు. రామ్ శంకర్ పాత్రలో ఎప్పటిలాగే ఎనర్జీ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్ అన్నిటిలో సూపర్బ్ అనిపించేసాడు. 

ఇక సంజయ్ దత్ విలన్ గా తన పవర్ చూపించాడు. రామ్ ఇంకా హీరోయిన్ కావ్య థాపర్ మధ్యన రొమాంటిక్ యాంగిల్ ని పూరి గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సాంగ్స్ లో మాత్రమే కాదు  కావ్య థాపర్ ని పూరి రొమాంటిక్ యాంగిల్ లో బాగానే వాడేసాడు. అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ వేరే లేవల్ గా పాన్ చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

మరోసారి మణిశర్మ మ్యూజిక్, BGM ఈ డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లో హైలేట్ అవగా సినిమాటోగ్రఫీ, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా ఉన్నాయి. 

Double iSmart Trailer Review:

Double iSmart Trailer Released

Tags:   DOUBLE ISMART
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement