Advertisementt

బాలయ్య మాట కోసం వెయిటింగ్

Fri 26th Jul 2024 08:17 PM
mokshagna  బాలయ్య మాట కోసం వెయిటింగ్
Waiting for Balayya fans బాలయ్య మాట కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

నందమూరి అభిమానులు బాలయ్య ఇచ్చే మాట కోసం వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 పూర్తి చేసే పనిలో చాలా బిజీగా వున్నారు. ఎన్నికల కోసం రెండుమూడు నెలలు సమయం వెచ్చించడంతో బాలయ్య ఇప్పుడు ఫుల్ కాన్సంట్రేషన్ NBK 109 పై పెట్టారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే దిశగా చిత్రీకరణ జరుపుకుంటుంది. 

అది ఓకె. మరి నందమూరి అభిమానులు దేని కోసం అంతగా వెయిట్ చేస్తున్నారు అంటే.. ఆయన వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్ర ప్రకటన కోసం. మోక్షుజ్ఞ న్యూ హీరో లుక్ వైరల్ కాగా.. ఆ వెంటనే మోక్షజ్ఞని హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యబోయే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత మోక్షజ్ఞ అక్క తేజస్విని అంటూ న్యూస్ లు మొదలైపోయాయి. 

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. అక్టోబర్ అంటే దసరా నుంచి మోక్షజ్ఞ కొత్త సినిమా మొదలవుతుంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఆ మాట బాలయ్య నోటి వెంట వినాలనేది ఆయన అభిమానుల కోరిక. అదేదో బాలయ్య మీడియా ముఖంగా చెబితే ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు కదా.. 

మరి బాలయ్య తన 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలెబ్రేషన్స్ లో ఏమైనా మోక్షజ్ఞ తెరంగేట్రం ప్రకట చేస్తారేమో చూడాలి. 

Waiting for Balayya fans:

Fans are waiting for Balayya announcement on Mokshagna entry

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ