Advertisementt

వారికి థాంక్స్ చెబుతున్న శృతి హాసన్

Fri 26th Jul 2024 05:59 PM
shruti haasan  వారికి థాంక్స్ చెబుతున్న శృతి హాసన్
Shruti Haasan celebrates 15 years in cinema వారికి థాంక్స్ చెబుతున్న శృతి హాసన్
Advertisement
Ads by CJ

శృతి హాసన్ సినిమా హీరోయిన్ గా కెరీర్ స్టార్ చేసి పదిహేనేళ్ళు పూర్తయ్యాయి. తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ భాషలో అయినా నటి గా అందరిని మెప్పించింది. కేవలం హీరోయిన్ గానే కాదు శృతి హాసన్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కూడా. ఇలా మల్టీటాలెంటెడ్ గా శృతి హాసన్ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. 

తాను నటిగా కెరీర్ లో పదిహేనేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పందిస్తూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి నటిగా ప్రవేశించి అప్పుడే పదిహేనేళ్ళు పూర్తయ్యాయి అంటే నమ్మశక్యంగా లేదు. నేను పెరిగిన సంగీత ప్రపంచంలో నేను ఇంత కాలం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా లైఫ్ ని కూడా నేను ఇండస్ట్రీలో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. 

నేను నా కెరీర్ ఆరంభం నుంచి నాకు అందమైన పాఠాలు నేర్పిన అందరికి ధన్యవాదాలు. నన్ను ఇంతకాలంగా నటిగా ఆదరించినందుకు ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు అందరికి థాంక్స్ అంటూ శృతి హాసన్ తన పదిహేనేళ్ల కెరీర్ పై మాట్లాడింది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు, తమిళ మూవీస్ తో బిజీగా వున్న హీరోయిన్. 

Shruti Haasan celebrates 15 years in cinema :

Shruti Haasan celebrates 15 years in cinema with a gratitude note

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ