Advertisementt

ఆధ్యాత్మిక చింతనలో సమంత

Tue 11th Jun 2024 08:19 PM
samantha  ఆధ్యాత్మిక చింతనలో సమంత
Samantha in spiritual contemplation ఆధ్యాత్మిక చింతనలో సమంత
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేసి విమర్శల పాలవుతున్న సమంత కి మొదటి నుంచి ఆధ్యాత్మికత కూసింత ఎక్కువే. తిరుపతి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ శ్రీవారిని దర్శించుకోవడం, అనేక సందర్భాల్లో ప్రత్యేక పూజలు చెయ్యడం,అవకాశం ఉన్నప్పుడల్లా సద్గురు సన్నిధిని సందర్శిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోవడం చూస్తుంటాము. 

ఈరోజు జూన్ 11 న సమంత సద్గురు ఆశ్రమంలో మెడిటేషన్ లో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ ఫొటోస్ తో పాటు ఒక పెద్ద నోట్ ను ఇన్స్టా వేదికగా రాసుకొచ్చింది. మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. మీ జీవితాన్ని ప్రత్యేకంగా చేసే అవగాహన, కరుణతో కూడిన వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు అది మరింత స్పెషల్ గా అవుతుంది. మీకు జ్ఞానం కావాలంటే దానిని ప్రపంచంలో వెతకాలి. 

ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. చాలామంది దానిని ఇది సాధారణమే అని అనుకుంటారు. ఇదేం మామూలు విషయం కాదు. అసలు దాని గురించి కేవలం తెలుసుకుంటే సరిపోదు కష్టపడాలి. నాలెడ్జ్ ను ఇంప్లిమెంట్ చేయడం అనేది నిజంగా చాలా ముఖ్యమైనది అంటూ సమంత రాసుకొచ్చింది. 

Samantha in spiritual contemplation:

Samantha in Sadguru Ashram

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ