Advertisementt

పోసాని పై ఫైర్ అయిన శివాజీ

Sat 08th Jun 2024 11:35 PM
shivaji  పోసాని పై ఫైర్ అయిన శివాజీ
Shivaji comments on Posani పోసాని పై ఫైర్ అయిన శివాజీ
Advertisement
Ads by CJ

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ టీడీపీ కి వీరాభిమాని. చంద్రబాబు నాయుడు పై ఈగ వాలినా శివాజీ ఊరుకోడు. అయితే కొన్నాళ్ల క్రితం సినిమాలు, రాజకీయాలకి దూరంగా ఉన్న శివాజీ మళ్ళి బిగ్ బాస్ లో తేలాడు. బిగ్ బాస్ లో విన్నర్ అవ్వాల్సిన శివాజీ కొన్ని విషయాల్లో ఆడియన్స్ దగ్గర వీకవడంతో టాప్ 3 తో సరిపెట్టుకున్నాడు. అయితే శివాజీ బిగ్ బాస్ లో ఉన్నపుడు చంద్రబాబు జైల్లో ఉన్నాడు.

అదే శివాజీ బయట ఉంది ఉంటే ఎంత రచ్చ చేసేవాడో అనుకున్నారు. ఇక ఈమధ్యన పొలిటికల్ గా యాక్టీవ్ అయిన.. శివాజీ టీడీపీ భారీ మెజారిటీతో గెలవడంతో నిన్న నారా లోకేష్ ని కలిసి వచ్చాడు. అయితే ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న శివాజీ పోసాని కృష్ణమురళిపై ఫైర్ అయ్యాడు. వైసీపీ పార్టీలో చేరి పోసాని సినిమా నటులపై, పవన్, బాలకృష్ణ, చంద్రబాబు లపై మాట్లాడిన తీరు చాలామంది తప్పుపట్టారు.

పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడే హక్కు నాకు లేదు కానీ.. కానీ ఆయన నా కులం గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన కులాల గురించి మాట్లాడటం తప్పని, ఇకపై అలాంటి పని మానుకుని మీ పని మీరు చూసుకోండి, మీదగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. మీకు బిడ్డలున్నారు. రేపు నేను పోయినా కూడా.. ఫలానా వాళ్ల బిడ్డలు అని అంటే గౌరవం పెరగాలి కానీ.. పలానా వాళ్ల బిడ్డ అంటే గౌరవం తగ్గకూడదు.. దాని గురించి ఆలోచించమంటూ శివాజీ పోసానికి హితవు పలికాడు. 

Shivaji comments on Posani:

Actor Shivaji comments on Posani Krishnamurali

Tags:   SHIVAJI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ