Advertisementt

గౌతమ్ గ్రాడ్యుయేషన్: మహేష్ పోస్ట్ వైరల్

Sun 26th May 2024 07:15 PM
mahesh  గౌతమ్ గ్రాడ్యుయేషన్: మహేష్ పోస్ట్ వైరల్
Mahesh new look from Gautam convocation గౌతమ్ గ్రాడ్యుయేషన్: మహేష్ పోస్ట్ వైరల్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇంటర్మీడియట్ పట్టా అందుకున్నాడు. గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి గ్రాడ్యువేషన్ పట్టా అందుకున్న సందర్భంగా మహేష్ మరియు నమృత ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను గర్వంతో పొంగిపోతున్నాను అని, లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదగాలని, కలలని సాకారం చేసుకునేందుకు పరిగెత్తాలని, గౌతమ్ ని చూసి తండ్రిగా గర్వపడుతున్నాను అంటూ మహేష్ పోస్ట్ పెట్టాడు. 

నమ్రత కూడా గౌతమ్ పట్టా అందుకున్న సందర్భంగా ఫొటోస్ ని షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం మానేసి ఘట్టమనేని అభిమానులు మహేష్ సరికొత్త లుక్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. 

రాజమౌళి తో మహేష్ చెయ్యబోయే మూవీ కోసం ఆయన మేకోవర్ అవుతున్నాడు. అందుకే ఎక్కువగా పబ్లిక్ లోకి కానీ, ఫ్యామిలీ పిక్స్ లో కానీ అరుదుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు కొడుకు కోసం మహేష్ బయటికి వచ్చాడో లేదో ఇలా ఆయన లుక్ వైరల్ గా మారడం కాదు.. మహేష్ కొత్త లుక్ చూసి మూవీ లవర్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Mahesh new look from Gautam convocation:

Mahesh and Namrata Insta Post on His Son Gautam Goes Viral

Tags:   MAHESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ