Advertisementt

కల్కి ఈవెంట్: ప్రభాస్ ఎంట్రీ అదిరిందిగా..

Wed 22nd May 2024 09:45 PM
kalki  కల్కి ఈవెంట్: ప్రభాస్ ఎంట్రీ అదిరిందిగా..
Kalki Event: Prabhas entry follows.. కల్కి ఈవెంట్: ప్రభాస్ ఎంట్రీ అదిరిందిగా..
Advertisement
Ads by CJ

కల్కి బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ అభిమానుల నడుమ కళ్ళు చెదిరే విధంగా జరుగుతుంది. కల్కి 2898 AD మేకర్స్ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఏ ఛానల్ కి లైవ్ ఇవ్వకుండా వైజయంతి వారి యూట్యూబ్ ఛానల్ నుంచే కల్కి ఈవెంట్ లైవ్ ప్రసారం చేస్తున్నారు. 

ఇక ఈ వేడుక కోసం ప్రభాస్ అభిమానులు వేలాదిగా రామోజీ ఫిలిం సిటీకి తరలి వచ్చారు. ఎప్పుడెప్పుడు లైవ్ లో ప్రభాస్ ని చూస్తామా అని చాలా ఆతృతగా అభిమానులు వెయిట్ చేసారు. అభిమానులు ఎలా కోరుకున్నారో.. దానికి మించి ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జి తో పాటుగా డ్రైవ్ చేస్తూ ఇచ్చిన ఎంట్రీ అద్దిరిపోయింది. ప్రభాస్ కారు దిగిన షాట్ కి అభిమానులు విజిల్స్ వెయ్యాల్సిందే.

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఈవెంట్ లో నాగ్ అశ్విన్ సింపుల్ గా కనిపించగా.. ప్రభాస్ కార్ నుంచి దిగి ఎంట్రీ ఇచ్చాక అభిమానులకి అభివాదం చేస్తూ చేతులు ఊపాడు.. ప్రభాస్ ని అలా చూడగానే కల్కి భైరవ లుక్ లో అద్దిరిపోయాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అశ్వినీదత్ ప్రభాస్ కి ఆహ్వానం పలికారు. 

ఆ తరవాత ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ తో అభిమానులు పులకించిపోయారు. బుజ్జి ని రివీల్ చేసిన వీడియో లో భైరవ vs బుజ్జి అన్నట్టుగా చూపించారు. ప్రభాస్ లుక్స్, బుజ్జి తో ప్రభాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Kalki Event: Prabhas entry follows..:

Kalki Bujji Event: Bhairava vs Bujji

Tags:   KALKI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ