Advertisementt

గేమ్ చేంజర్ బ్యూటీ - గ్లామరస్ లుక్

Sat 18th May 2024 08:24 PM
kiara advani  గేమ్ చేంజర్ బ్యూటీ - గ్లామరస్ లుక్
Game Changer Girl - Glamorous Look .. గేమ్ చేంజర్ బ్యూటీ - గ్లామరస్ లుక్
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తుంది. అందాల తార ఐశ్వర్య కేన్స్ ఫిలిం  ఫెస్టివల్ రెడ్ కార్పెట్ చేసే రచ్చ చూసాక.. కియారా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముందు తేలిపోతుందేమో అనే టాక్ నడిచింది. కానీ కియారా అద్వానీ మాత్రం ఐష్ స్టయిల్ కి అందానికి ఏ మాత్రం తగ్గలేదు. 

వైట్ మోడ్రెన్ డ్రెస్ లో కియారా అద్వానీ లుక్ చూసిన నెటిజెన్స్, ఆమె అభిమానులు కిక్ ఇచ్చే కియారా స్టన్నింగ్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు గేమ్ చేంజర్ గర్ల్ - గ్లామరస్ లుక్ అంటూ వర్ణిస్తున్నారు. తెలుపు రంగు స్లీవ్ లెస్ వేసుకుని స్టయిల్ గా ఎంతో ప్ల‌జెంట్ గా కార్పెట్ పై వాక్ చేసింది. ముఖ్యంగా కియారా చెవుల‌కు ధ‌రించిన డిజైన‌ర్ చెవులీలు ఆమె అందాన్ని మరింతగా పెంచింది.

కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లో నటిస్తుంది. ఇది 3 లాంగ్వేజెస్ లో రిచ్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం. గేమ్ చేంజర్ చిత్రం ఇంకా విడుదల కాకూండానే మరో గ్లోబర్ స్టార్ ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న వార్ 2 లోను కియారా ని హీరోయిన్ గా మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం కియారా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ స్టన్నింగ్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Game Changer Girl - Glamorous Look ..:

Kiara Advani stunning look gives a kick

Tags:   KIARA ADVANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ