Advertisement

హరీష్ శంకర్ ఏంటి ఇట్టా ఫైరయ్యాడు

Mon 13th May 2024 01:44 PM
harish shankar  హరీష్ శంకర్ ఏంటి ఇట్టా ఫైరయ్యాడు
Harish Shankar was fired హరీష్ శంకర్ ఏంటి ఇట్టా ఫైరయ్యాడు
Advertisement

దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయనతో ప్రస్తుతం హరీష్ శంకర్ ఉస్తాద్ భాగసింగ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఉస్తాద్ కోసం కేటాయించినా హరీష్ మాత్రం అదిరిపోయే అవుట్ ఫుట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పై విపరీతమైన అంచనాలు పెంచేసాడు. 

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయపార్టీ జనసేనకు ఎప్పుడో సంఘీభావం ప్రకటించిన హరీష్ శంకర్ ఈరోజు పోలింగ్ తేదీ కావడంతో ఓటు వేసి వచ్చి మరీ జగన్ పై ఇండైరెక్ట్ గా విరుచుకుపడ్డాడు. 

రాజకీయాల్లో వచ్చి సంపాదించిన నాయకులు కాదు.. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టిన నాయకుడిని గుర్తించండి. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి.. అదే ఈ ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా.. అంటూ ట్వీట్ వేసాడు. 

మరి ఈ బటన్ నొక్కుడు అనేది జగన్ ని ఉద్దేశించే.. హరీష్ శంకర్ జగన్ ని ఇండైరెక్ట్ గా బటన్ ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేసినట్లుగా జన సైనికులు, పవన్ అభిమానులే కాదు.. హరీష్ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాట. అంతేకాదు.. హరీష్ శంకర్ ఏంటి.. ఇట్టా ఫైరయ్యాడని మాట్లాడుకుంటున్నారు. 

Harish Shankar was fired:

Harish Shankar indirect dig to Jagan

Tags:   HARISH SHANKAR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement