Advertisement

విశ్వంభర కి త్రిష పారితోషికం వింటే షాకే

Sun 05th May 2024 09:48 AM
trisha  విశ్వంభర కి త్రిష పారితోషికం వింటే షాకే
Trisha Receives Fat Pay For Vishwambhara విశ్వంభర కి త్రిష పారితోషికం వింటే షాకే
Advertisement

ప్రస్తుతం కోలీవుడ్ లో త్రిష టైమ్ స్టార్ట్ అయ్యింది. పొన్నియన్ సెల్వన్ చిత్రం తర్వాత త్రిష మరోసారి క్రేజీ హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్, అజిత్, కమల్ హాసన్ చిత్రాల్లో హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లోను మెగాస్టార్ చిరుతో చాలా ఏళ్ళ తర్వాత విశ్వంభర లో కలిసి నటిస్తుంది.

త్రిష బర్త్ డే స్పెషల్ గా వదిలిన ఫస్ట్ లుక్ లో త్రిష చాలా అందంగా, ఆకర్షణగా కొత్తగా కనిపించింది. అయితే వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటిస్తున్న ఈ చిత్రం భారీ ఉడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా ఎంటర్ అవడమే కాదు.. ఇప్పటికే ఓ పాట అలాగే కొన్ని కీలక సన్నివేశాలని ఆమె పూర్తి చేసింది.

అయితే త్రిష విశ్వంభర చిత్రంలో నటిస్తున్నందుకు గాను భారీ పారితోషకమే అందుకుంటుంది. కోట్లలో భారీ రెమ్యునరేషన్ ని త్రిషకి నిర్మాతలు ముట్టజెబుతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ లోను త్రిష థగ్ లైఫ్ కోసం భారీ పారితోషికం అందుకుంటూ లేడీ సూపర్ స్టార్, సౌత్ నెంబర్ 1 హీరోయిన్ నయనతారని బీట్ చేసింది అనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. 

Trisha Receives Fat Pay For Vishwambhara :

Shocked to hear Trisha Remuneration for Vishwambhara

Tags:   TRISHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement