యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మే 20 కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు ఆయన బర్త్ డే. ఆరోజు ఆయన నటించే చిత్రాల నుంచి వచ్చే అప్ డేట్స్ కోసం అప్పుడే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం మొదలు పెట్టారు. కొంతమంది ఎన్టీఆర్ భారీ కటౌట్ ని పెట్టి అప్పుడే పాలాభిషేకాలు మొదలు పెడితే మరికొందరు ఎన్టీఆర్ బ్యానర్ లు కట్టి రచ్చ మొదలు పెట్టారు.
అయితే మే 20 ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం దేవర చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ గ్రాండ్ గా హిందీలోకి అడుగుపెడుతున్న వార్ 2 నుంచి స్పెషల్ అప్ డేట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్-నీల్ కాంబో NTR 31 నుంచి కూడా ఓ అప్ డేట్ ఉంటుంది అంటూ సంబరపడుతున్నారు.
అందుకే మే 20 త్వరగా వచ్చేయ్ అంటూ ఈ విధంగా పోస్ట్ లు పెడుతున్నారు అభిమానులు.
#Devara First Single..
-> #War2 Update..
-> #NTRNeel Shooting Update..
May 20 fast ga vachey @tarak9999 🥵💥 ఇలా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఎంతెలా వెయిట్ చేస్తున్నారో అనేది చూపిస్తున్నారు.




వాస్తు మారిస్తే వైసీపీ గెలుస్తుందా..!?

Loading..