Advertisement

దేవర ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్

Fri 03rd May 2024 09:48 PM
devara  దేవర ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్
Crazy news on Devara1st single దేవర ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ ఆయన వార్ 2 షూటింగ్ కి హాజరవడమే కాదు.. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ తో కలిసి డిన్నర్ పార్టీలో భార్య ప్రణతితో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబై షూటింగ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకుని ఉన్నారు ఆయన అభిమానులు. 

ఇక ఇక్కడ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ కి చిన్న విరామమిచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ముంబై నుంచి రాగానే దేవర మిగతా షూటింగ్ పూర్తి చేస్తారు. ఈలోపులో దేవర నుంచి కొరటాల శివ 1st వదిలే ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్ డే మే 20. ఈసారి ఆయన పుట్టిన రోజుకి దేవర నుంచి అదిరిపోయే మొదటి పాటని వదలబోతున్నారని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ నుంచి అదిరిపోయేలా దేవర ఫస్ట్ సింగిల్ రెడీ అవుతుందట.  

ఆయన అభిమానులైతే అప్పుడే #DevaraFirstSingle హాష్ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో మరో మరాఠీ భామ కూడా నటిస్తుంది. శృతి మారాఠి దేవరాలో కీలకపాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న విడుదల కాబోతుంది. 

Crazy news on Devara1st single:

All Set For Devara First Single

Tags:   DEVARA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement