Advertisement

మేనిఫెస్టోకు పడతారా? పెన్షనర్ల ఓటెవరికి?

Fri 03rd May 2024 03:37 PM
ycp  మేనిఫెస్టోకు పడతారా? పెన్షనర్ల  ఓటెవరికి?
YCP vs TDP మేనిఫెస్టోకు పడతారా? పెన్షనర్ల ఓటెవరికి?
Advertisement

ఏపీ ఎన్నికల్లో వైసీపీ vs కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) అన్నట్టుగా ప్రచారం లో రాజకీయనేతలు దూసుకుపోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అయ్యేందుకు కష్టపడుతుంటే.. ఈసారి అధికారాన్ని చేజిక్కించుకునే వరకు నిద్రపోనని చంద్రబాబు శపధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ ని గద్దె దించేవరకు ఊరుకోనని అంటున్నారు. 

ఇక వైసీపీ మ్యానిఫెస్టో కన్నా మెరుగ్గా కూటమి మ్యానిఫెస్టో కనిపిస్తుంది. చంద్రబాబు సూపర్ సిక్స్, కూటమి మ్యానిఫెస్టో రెండూ వైసీపీ కన్నా ప్రజలని ఆకర్షించే పథకాలతో కనబడుతుంది. మరి ఏపీ ప్రజలు మ్యానిఫెస్టోలకి పడిపోయి ఓట్లు గుద్దుతారా.. వైసీపీ గతంలో ఉన్న పథకాలనే ఓ రెండు వేలు పెంచి ప్రజలకిస్తా అంటుంది. చంద్రబాబు మాత్రం వైసీపీ కి డబుల్ పథకాలతో ప్రజలని పడేస్తున్నారు. 

ఇక ఇప్పుడు ఏపీలో నడుస్తున్న ప్రధాన సమస్య పెన్షన్. ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అందుకునే పెద్ద, పేదవాళ్ళు ఇప్పుడు ఆ పెన్షన్ కోసం బ్యాంకు లకి వెళ్లాలిసిన పరిస్థితి. పేదవాళ్ల పెన్షన్ అగచాట్లకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కారణమంటూ వైసీపీ దాడి చేస్తుంది. చంద్రబాబు వలనే వాలంటీర్లని ఈసీ ఆపేసింది. నెల నెల ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు పడిగాపులు కాస్తూ బ్యాంకు లో తీసుకోవాల్సి వస్తుంది అది బాబు వలనే అంటూ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. 

వైసీపి అనుకూల బ్లూ మీడియా అయితే పదే పదే ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెగ కష్టపడుతుంది. అటు చంద్రబాబు, టీడీపీ నేతలు దానిని సరిగ్గా డిపెండ్ చేసుకోలేకపోతున్నారు. కేవలం చంద్రబాబు ఈసీకి లేఖలతో సరిపెడుతున్నారు. ఇదే వైసీపి కి ఆయుధంగా మారింది. పెన్షనర్లని చంద్రబాబు ఏడిపించారు, ఈసారి పెన్షనర్ల ఓట్లు మాకే అని బలంగా అంటున్నారు. మరోపక్క చంద్రబాబు పెన్షన్ పెంచి ఇస్తామంటున్నారు. ఇది చూసుకుంటే చంద్రబాబుకే కలిసొచ్చేలా ఉంది. చూద్దాం ఫైనల్ గా ఏపీ ప్రజల, పెన్షనర్ల ఓటెవరికో అనేది.!

YCP vs TDP:

Falling for the manifesto? Who is the vote of the pensioners?

Tags:   YCP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement