Advertisementt

శ్రీలీలకు మరో బంపరాఫర్

Fri 26th Apr 2024 09:25 AM
sreeleela goat  శ్రీలీలకు మరో బంపరాఫర్
Sreeleela Special Song in Star Hero Film శ్రీలీలకు మరో బంపరాఫర్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్రష్ శ్రీలీలకు మరో బంపరాఫర్ తగిలింది. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేని హీరోయిన్‌గా నిన్న, మొన్నటి వరకు సెన్షేషన్‌ని క్రియేట్ చేసిన శ్రీలీలకు ఇప్పుడు కోలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. రీసెంట్‌గా మైత్రి మూవీ మేకర్స్ అజిత్‌తో నిర్మించనున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో శ్రీలీలకు ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 

అయితే ఈ కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఆమెకు వచ్చింది హీరోయిన్ ఛాన్స్ కాదు. స్పెషల్ సాంగ్ ఆఫర్. అవును ఇలయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న GOAT (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదించినట్లుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఆమె తెలిసిన అందరికీ తెలుసు. అలాగే విజయ్ కూడా డ్యాన్స్ పరంగా టాక్ ఆఫ్ ద కోలీవుడ్‌గా నిలుస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సాంగ్ అంటే.. డ్యాన్స్ బీభత్సమే అని చెప్పుకోవాలి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ GOAT సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హీరో విజయ్‌కి ఇది 68వ సినిమా. త్వరలోనే శ్రీలీల సాంగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Sreeleela Special Song in Star Hero Film:

Sreeleela Shifting Her Base To Kollywood

Tags:   SREELEELA GOAT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ