Advertisementt

భీమా అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

Sat 13th Apr 2024 11:57 AM
gopichand  భీమా అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
Bhimaa OTT Release Date Locked భీమా అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
Advertisement
Ads by CJ

గోపీచంద్ లేటెస్ట్ చిత్రం భీమా. మార్చ్ 8 మహాశివరాత్రి స్పెషల్ గా థియేటర్స్ లో విడుదలైన భీమా కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, క్రిటిక్స్ మాత్రం మిక్సెడ్ రెస్పాన్స్ ఇచ్చిన భీమా చిత్రం పై ఓటీటీ ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రం ఏ ఓటీటీ నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న తేదీ ఏప్రిల్ 12 అంటే నిన్న శుక్రవారం. భీమా ఓటీటీ రిలీజ్ ఉంటుంది అనుకున్నారు. 

కారణం భీమా తో పాటుగా థియేటర్స్ లో రిలీజ్ అయిన చిత్రాలు ఏప్రిల్ 12 నుంచి వివిధ ఓటీటీల నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. అందుకే భీమా కూడా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అనుకున్నారు. 

కానీ కొన్ని కారణాల వలన భీమా ఓటీటీ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ దీనికి మరో తేదీని ఫిక్స్ చేసింది. భీమా చిత్రం ఏప్రిల్ 25 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్లుగా పోస్టర్ తో పాటుగా అనౌన్స్ చేసారు. మరి థియేటర్స్ మిస్ అయిన వాళ్లంతా భీమా ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 25 నుంచి చూసేందుకు సిద్దమైపొండి. 

Bhimaa OTT Release Date Locked:

Gopichand Bhimaa OTT Release Date Locked

Tags:   GOPICHAND
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ