Advertisement

తగ్గేదేలా.. బాబుకు బీజేపీ బ్రేక్!

Wed 20th Mar 2024 10:06 PM
tdp  తగ్గేదేలా.. బాబుకు బీజేపీ బ్రేక్!
BJP break for Babu! తగ్గేదేలా.. బాబుకు బీజేపీ బ్రేక్!
Advertisement

అదిగో.. టీడీపీ థర్డ్ లిస్ట్ రెడీ.. ఇదిగో ప్రకటనే ఆలస్యం.. ఇవాళ సాయంత్రానికి వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి తమ్ముళ్లూ.. అని మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకుని సోషల్ మీడియా వరకూ మంగళవారం నాడు ఒక్కటే రచ్చ.. చర్చ! సీన్ కట్ చేస్తే సీబీఎన్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోగా.. అబ్బే ఆ ఊసే లేదు. దీంతో ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా..? రెండు జాబితాల్లో లేని పేర్లు.. మూడో జాబితాలో అయినా ఉంటుందా అని ఆశావహుల పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రకటనా లేదు పాడు లేదబ్బా అని తీరా టీడీపీ వర్గాల సమాచారం రావడంతో ఈ మాత్రానికి ఇంత హడావుడి ఎందుకనీ ఒకింత తెలుగు తమ్ముళ్లు నొచ్చుకున్నారట. అయితే.. వాస్తవానికి నిన్నే ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించినప్పటకీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బ్రేక్ వేశారని టాక్ గట్టిగానే నడుస్తోంది. కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినప్పటికీ కొన్ని నియోజకవర్గాలు అడిషనల్‌గా, మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని కమలనాథులు పట్టుబడుతున్నారట. దీంతో నిన్నటి ప్రకటనకు బ్రేక్ పడింది.

ఎవరెవరికి ఫిక్స్!

1. శ్రీకాకుళం : రామ్మోహన్ నాయుడు

2. విశాఖపట్టణం : ఎం. భరత్

3. అమలాపురం : గంటి హరీశ్

4. విజయవాడ : కేశినేని శివనాథ్ (చిన్ని)

5. గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్

6. నరసరావుపేట : లావు శ్రీకృష్ణ దేవరాయులు

7. ఒంగోలు : మాగుంట రాఘవ రెడ్డి

8. నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

9. చిత్తూరు : దగ్గుమళ్ల ప్రసాద్

10. అనంతపురం : బి.కె. పార్థసారథి

11. నంద్యాల : బైరెడ్డి శబరి లను ఎంపీ అభ్యర్థులు టీడీపీ అధిష్టానం ఫిక్స్ చేసింది. ఇక అధికారిక ప్రకటన చేద్దామనుకున్న టైమ్‌లో ఈ 11 స్థానాల్లో ఒకట్రెండు బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ స్థానం విషయంలోనే టీడీపీ-బీజేపీ మధ్య సెట్ కావట్లేదని తెలుస్తోంది. ఇక్కడ్నుంచి పోటీచేయాలని జీవీఎల్ నర్సింహారావు, దగ్గుబాటి పురంధేశ్వరి ఇద్దరూ పోటీ పడుతున్నారు. అయితే టీడీపీ మాత్రం తమ అభ్యర్థినే నిలుపుతామని చెప్పడంతో ఇక్కడే పెండింగ్‌ పడిందని.. అందుకే ప్రకటన ఆలస్యమైందని తెలుస్తోంది. పురంధేశ్వరిని రాజమండ్రి నుంచి పోటీ చేయించాలని హైకమాండ్ భావిస్తోంది. సీట్ల విషయంలో మాత్రం బీజేపీ తగ్గేదేలా అంటోందట.

ఏం తేలుతుందో..!

మరోవైపు ఏలూరు, నర్సాపురం అభ్యర్థుల విషయంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య నానా రచ్చే జరుగుతోంది. ఏలూరు నుంచి ఫుల్ కాంపిటీషనే ఉంది. ఇక్కడ్నుంచి పోటీచేయడానికి టీడీపీ తరఫున ఐదారుగురు రెడీగా ఉన్నారు. గోరుముచ్చు గోపాల్‌యాదవ్‌, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్‌యాదవ్‌, పోలీస్‌ అధికారి సత్యనారాయణ పోటాపోటీగా ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం తమకే కావాలని పట్టుబట్టింది. ఇది పక్కాగా పసుపు పార్టీ గెలిచే సీటని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరెవరికీ ఇవ్వొద్దని అగ్రనేతలు..చంద్రబాబుకు చెబుతున్నారట. ఇక నర్సాపురంలో అయితే పెద్ద సీనే నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూటమిలో భాగంగా పోటీచేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. శ్రీనివాస వర్మ తానే కూటమి నుంచి పోటీచేస్తానని.. చెప్పుకుంటున్నారు. దీంతో ఈ రెండు సీట్ల పెద్ద పీటముడిగానే ఉన్నాయ్. వాస్తవానికి ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో 17 టీడీపీ, 06 బీజేపీ, 02 జనసేనకు కేటాయింపులు జరిగాయి. అయితే మార్పులు, చేర్పులు.. ఆశింపులు ఎక్కువవ్వడంతో ఇలా పెండింగ్‌లు పడుతున్నాయి. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న పురంధేశ్వరి.. పెద్దలతో మాట్లాడి లెక్కలు తేల్చుతారని ఆ తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే అసలు సినిమా ఇప్పుడే మొదలైందని బీజేపీ నుంచి ఇప్పుడు బాబుకు అన్నీ అడ్డంకులే ఉంటాయని.. మున్ముందు బ్రేక్‌లు గట్టిగానే ఉంటాయని వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.

BJP break for Babu!:

 TDP 3rd List Ready To Release

Tags:   TDP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement