ప్రేమలు పై విశ్వక్ సెటైర్

Vishwak Sen Satire on Premalu MovieVishwak Sen Satire on Premalu Movie

మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేయగా.. టాలీవుడ్‌లో మంచి స్పందననే రాబట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి.. సినిమా చూసిన వారంతా.. బాగా ఎంజాయ్ చేశామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి, రాజమౌళి.. తాజాగా మహేష్ బాబు వంటి వారంతా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా విడుదల రోజే విడుదలైన విశ్వక్ సేన్ గామి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాపై కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా విశ్వక్ సేన్ స్పందించారు.

మమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా పరవాలేదు.. కానీ బ్యాడ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలియదు నాకు.. నేను పట్టించుకోదలుచుకోలేదు కూడా. ఎందుకంటే నాకు అంత టైమ్ లేదు. మా సినిమాని కూడా నలుగురు పెద్ద మనుషులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే, ఇది మన తెలుగు సినిమా. కచ్చితంగా చెప్పగలను ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెబుతాను. 10, 20 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో ఇలాంటి సినిమా ఒకటి ఉందని ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రేమలు సినిమాని టార్గెట్ చేస్తూ విశ్వక్ మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇది ప్రేమలు సినిమాను ఉద్దేశించే అని చెప్పడానికి కారణం.. విశ్వక్ చెప్పిన మాటల్లో నలుగురు పెద్ద మనుషులు, అలాగే ఇది తెలుగు సినిమా అని చెప్పడమే కారణం. ఎందుకంటే ప్రేమలు సినిమా మలయాళం సినిమా. అందుకే.. అంతా ప్రేమలు పై విశ్వక్ సెటైర్ వేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ అన్నాడని కాదు కానీ.. గామిలాంటి చిత్రాలు నిజంగానే రేర్‌గా వస్తాయి. అలాంటి చిత్రాలను ఆదరిస్తేనే.. మళ్లీ అలాంటి కొత్త కంటెంట్ చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. మరి విశ్వక్ కోరిక మేరకు.. ఈ సినిమాను చూసే ఆ పెద్ద మనుషులెవరో చూద్దాం.. 

Vishwak Sen Talks About Gaami Movie

vishwak sen premalu