Advertisementt

కుబేర సెట్‌లో కింగ్.. ఫొటో వైరల్

Sat 23rd Mar 2024 08:45 AM
kubera movie  కుబేర సెట్‌లో కింగ్.. ఫొటో వైరల్
Kubera New Shooting Schedule Begins In Bangkok కుబేర సెట్‌లో కింగ్.. ఫొటో వైరల్
Advertisement
Ads by CJ

కుబేర సెట్స్‌లోకి కింగ్ నాగార్జున అడుగుపెట్టారు. కింగ్ నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం కుబేర. రీసెంట్‌గానే ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మహాశివరాత్రి స్పెషల్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ధనుష్‌ని చూసిన వారంతా.. ఇదొక డిఫరెంట్ సినిమాగా భావిస్తున్నారు. అందులోనూ శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తెలియజేశారు.

బ్యాంకాక్‌లో కుబేర కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. నాగార్జున సెట్స్‌లో ఉన్న పిక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ వర్కింగ్ స్టిల్‌లో నాగార్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొననున్న ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ, యాక్షన్ పార్ట్‌ని చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకు కనిపించని లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా ఈ అప్‌డేట్‌లో మేకర్స్ వెల్లడించారు.

శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్,  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Kubera New Shooting Schedule Begins In Bangkok:

Kubera Movie Shooting Update

Tags:   KUBERA MOVIE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ