ఎన్నాళ్లకెన్నాళ్లకు అనుష్క దర్శనం

సైజ్ జీరో టైమ్‌లో బరువు పెరిగిన అనుష్క దాని నుంచి బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా తన సమస్య నుంచి బయటపడలేక మీడియాకి ముఖం చూపించడం మానేసింది. ఆమె బరువు ఆమెకి శాపంగా మారింది. ఇక రెండేళ్లకో సినిమా చేస్తూ ఆ సినిమా ప్రమోషన్స్‌కు కూడా తప్పించుకుంటుంది. నిశ్శబ్దం కరోనా సమయంలో రాబట్టి ప్రమోషన్స్ పని లేకుండా పోయింది. ఇక రీసెంట్‌గా వచ్చిన మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి టైమ్‌లో కూడా మీడియా ముందుకు వచ్చేందుకు అనుష్క ఇష్టపడలేదు.
ఇక ఇప్పడు క్రిష్ దర్శకత్వంలో అనుష్క సైలెంట్‌గా ఓ మూవీ మొదలు పెట్టింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ఆ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. అయితే కొన్నేళ్లుగా అనుష్క పబ్లిక్ ఫంక్షన్‌లో కానీ, తన సినిమా ఈవెంట్స్‌లో కానీ కనిపించడం లేదు. తాజాగా అనుష్క బయటికి వచ్చింది. అది కూడా షాకింగ్ లుక్‌లో. అంటే గత కొన్నేళ్లుగా భారీ శరీరంతో కనిపించిన అనుష్క రీసెంట్ లుక్‌లో కాస్త సన్నబడి స్లిమ్‌గా కనిపించడం హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఆమె ఓ మలయాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంలో మేకర్స్‌తో కలిసి అనుష్క దిగిన ఫోటో బయటికి రావడంతో అనుష్కని చూసిన వారంతా ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ కామెంట్స్ చెయ్యడమే కాదు స్లిమ్ లుక్‌లో అనుష్క ఎంత బాగుందో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Anushka Shetty at Shoot Of Malayalam Film Kathanar
Anushka Surprises With Her Look







































