Advertisement

నిబంధన ఎత్తేశారహో.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్..!

Mon 11th Mar 2024 09:54 PM
congress  నిబంధన ఎత్తేశారహో.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్..!
Congress is in full swing..! నిబంధన ఎత్తేశారహో.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్..!
Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవైపు పార్టీ తెలంగాణ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటోందన్న ఆనందం.. మరోవైపు కుటుంబానికి ఒక్కటే టికెట్ నిబంధన తీసేశారన్న ఆశ.. కలగలిసి కాంగ్రెస్ నేతలంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ కుటుంబానికి ఒక్కటే టికెట్ అని నేతలంతా భావించారు. కానీ సీనియర్ నేత జానారెడ్డి ఫ్యామిలీకి టికెట్ దక్కడంతో అంతా చాలా సంతోషంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలంతా అధిష్టానంపై ప్రెజర్ పెంచుతున్నారు. తమ కుటుంబ సభ్యులకే సీటు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇలా ప్రాంతానికి ఒకరైతే ఉన్నారు. 

ఎవరు నిలబడినా విజయం ఫిక్స్..!

ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి మంత్రులంతా తమ కుటుంబ సభ్యులకు ఎంపీ సీటు ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని టాక్. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా కూడా విజయం ఖాయమేనన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. దీంతో నేతలంతా ఇక్కడి సీటు కోసం పట్టుబడుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి తమ కుమారుడి కోసం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చేసి తన తమ్ముడి కోసం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి కోసం.. మరోవైపు మాజీ మంత్రి, భట్టి సోదరుడు మల్లు రవి సైతం ఖమ్మం ఎంపీ సీటుపై ఆశతో ఉన్నారు.

గెలుపు గుర్రాలకే టికెట్..

ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ నేతలు ఈ విధంగానే ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల కోసం పట్టుబడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపైనా ఒత్తిడి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే గెలుపు గుర్రాలకే టికెట్ అని కాంగ్రెస్ అధిష్టానం భీష్మించుకుని కూర్చొంటే తప్ప పరిస్థితులు సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో సీనియర్స్ గొడవ లేదంటే ఇప్పుడు తిరిగి ఎంపీ సీట్ల విషయంలో ప్రారంభమైంది. ఇక ఏం జరుగుతుందో.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Congress is in full swing..!:

Congress: Ticket for winning horses..

Tags:   CONGRESS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement