Advertisementt

ప్రభాస్ స్పిరిట్ స్టోరీని సింపుల్ గా చెప్పేసిన వంగ

Thu 29th Feb 2024 08:29 PM
sandeep reddy  ప్రభాస్ స్పిరిట్ స్టోరీని సింపుల్ గా చెప్పేసిన వంగ
Prabhas SPIRIT Genre Revealed ప్రభాస్ స్పిరిట్ స్టోరీని సింపుల్ గా చెప్పేసిన వంగ
Advertisement
Ads by CJ

సందీప్ వంగ ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా వినిపిస్తోన్న పేరు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడే మూడు చిత్రాలతో సందీప్ వంగ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో ప్రకటించడమే కాదు.. ఆ చిత్రానికి స్పిరిట్ టైటిల్ ని కూడా ఎప్పుడో ప్రకటించారు. ఇప్పటివరకు ప్రభాస్ ని ఎవరూ చూపించని విధంగా మాస్ గా అర్జున్ రెడ్డి లా చూపిస్తారంటూ మాట్లాడుకుంటున్నారు.

అయితే స్పిరిట్ స్టోరీపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. స్పిరిట్ స్టోరీ లైన్ వార్ & హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పుకార్లకి సందీప్ వంగ చెక్ పెట్టాడు. బాలీవుడ్ సినిమా దుకాణ్ టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్‌రెడ్డి స్పిరిట్ స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్పేసాడు. అందరూ అనుకుంటున్నట్టు స్పిరిట్ హారర్ సినిమా కాదని, ఇది ఒక నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ కథ అంటూ స్పిరిట్ స్టోరీ లైన్ పై స్పందించాడు సందీప్. 

అంతేకాకుండా తానిప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్నాను అని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్ మొదటిసారి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండడంతో ఫాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

Prabhas SPIRIT Genre Revealed:

Sandeep Reddy Vanga On Prabhas SPIRIT

Tags:   SANDEEP REDDY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ