పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా జగన్ ని గద్దె దించాలి, వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదు, జగన్ ని ఇంటికి పంపించాలంటూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం కుర్చీ నుంచి జగన్ ని దించాలనే తాను టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాను అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఎప్పుడూ జగన్ ని తక్కువ చేసి మాట్లాడం కానీ, ఆయన్ని కించపరిచేలా పవన్ వ్యవహరించడం కానీ చెయ్యలేదు పవన్. కానీ సీఎం స్థానంలో జగన్ తో సహా తన మంత్రులు పవన్ కళ్యాణ్ ని కించరిచేలా పదే పదే ఆయన్ని అవమానిస్తూ మాట్లాడం అనేది పరిపాటిగా మారింది. పవన్ కళ్యాణ్ ని ఎలా టార్గెట్ చెయ్యాలో తెలియక ఆయన పెళ్లిళ్లపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేసేవారు. పవన్ కళ్యాణ్ భార్యలని సరిగ్గా చూసుకోలేడు, ఇంకా రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ స్పీచ్ ఇచ్చిన ప్రతిసారి అనడం చూస్తున్నాం.
అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ జగన్ పై వ్యక్తిగతం కామెంట్స్ చెయ్యకపోయినా.. గత రాత్రి తాడేపల్లిగూడెం సభలో మాత్రం ఓ రేంజ్ లో ఆడుకున్నారు.. జగన్ పర్సనల్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు కొద్దీ ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేసేవాడివో.. బంజారా హిల్స్ రెస్టారంట్ లో ఏం చేసే వాడివో.. నాకు తెలుసు అంటూ పవన్ జగన్ కి ఇచ్చిపడెయ్యడమే కాదు.. నాకు నాలుగో పెళ్ళాం అంటూ జగన్ మాట్లాడుతూ ఉంటారు.. మరి నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్ అంటూ పవన్ జగన్ కి డైరెక్ట్ గానే ఎడా పెడా ఇచ్చేసారు.
అది చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ లాంటి వ్యక్తిని నాలుగో పెళ్ళాం అంటూ హేళన చేస్తారా.. అంటూ తెగ ఫీలైపోతున్నారు. అది చూసిన పవన్ ఫాన్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. సీఎం అయి వుండి, పాలసీల గురించి కాకుండా పదే పదే పెళ్ళాల ఊసెత్తితే రిటార్టులిలాగే ఉంటాయి అంటూ పవన్ ఫాన్స్ వైసీపీ నేతలపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.




                     
                      
                      
                     
                    
 పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్న దీప్‌వీర్

 Loading..