జగన్ నిండా మునిగితే ఆయనే కారణమట..
ఒకవేళ వైసీపీ ఓడిపోయిందంటే కారణం పక్కాగా ఆయనే.. విపక్ష నేతలు ఏం మాట్లాడినా పక్కాగా ఆయనే మీడియా ముందుకు వస్తారు. పార్టీలోనూ ఆయనే.. పార్టీ బయటా ఆయనే. ఎవరికి ఏ సీటు కేటాయించాలన్నా ఆయనే. పార్టీలో ఎవరిని పక్కనబెట్టేయాలన్నా ఆయనే. చివరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లి షర్మిలా రెడ్డిల మధ్య చిచ్చుకు కూడా కొంత మేర కారణం ఆయనే. ఇక ఈయన కొడుకు కూడా తక్కువ తినలేదండోయ్.. టార్గెట్ కింగ్. నచ్చకుంటే బీభత్సంగా టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తారట. దందాలు.. కబ్జాలు బీభత్సమట. జగన్ ఈసారి ఎన్నికల్లో మునిగారో.. దానికి పక్కాగా ఈ తండ్రీకొడుకులే కారణమట. ఇంతకీ ఎవరనేది కొంత మేర అర్థమై ఉంటుంది కదా..!
ఐ ప్యాక్ కంటే దారుణంగా...
అదేనండి.. పేరుకే ప్రధాన కార్యదర్శి కానీ సకల శాఖ మంత్రిగా ఫేమస్ అయిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఈయన జగన్ రిమోట్‌లా మారిపోయారు. సజ్జల కదలమంటే కదులుతారు.. ఆగమంటే ఆగుతారట. కూర్చోమంటే కూర్చొంటారు.. నిల్చోమంటే నిలుచుంటారట. ఇక ఇప్పుడు టికెట్ కేటాయింపులోనూ ఆయనదే తుది నిర్ణయమట. సజ్జల ఓకే అన్నావారికే టికెట్ అట. అసలు ఐ ప్యాక్ కంటే కూడా సజ్జల దారుణంగా మారిపోయారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. పోనీ ఇవే చేస్తున్నారా? అంటే విపక్షాలు ఏ ఆరోపణ చేసినా కూడా ఆ శాఖ మంత్రి మీడియా ముందుకు రారు. ఈయన మాత్రమే వస్తారు. అన్ని శాఖల తరుఫున ఈయనే సమాధానమిస్తారు.
ఆ చర్చలు ఏమైనా కొలిక్కి వచ్చాయా?
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఎన్నికల్లో వైసీపీ నిండా మునిగిందంటే దీనికి కారణం పూర్తిగా సజ్జల, ఆయన తనయుడేనని టాక్ నడుస్తోంది. ప్రతి ఒక్క వ్యవహారంలోనూ వేలు పెట్టి.. టికెట్ కేటాయింపులోనూ పూర్తి స్థాయిలో జగన్‌ని గైడ్ చేశారు. పైగా ప్రతిపక్షాలపై ఆయన ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. చివరకు ఉద్యోగులతో చర్చలు కూడా ఈయనే నిర్వహించారు. పోనీ ఆ చర్చలు ఏమైనా కొలిక్కి వచ్చాయా? అంటే అదీ లేదు. దీంతో వారంతా జగన్‌కు వ్యతిరేకమయ్యారు. టికెట్ల కేటాయింపులోనూ కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నారని టాక్. అన్ని విషయాల్లోనూ వేలు పెట్టి పెంట పెంట చేయడంలో ఈయన దిట్ట. మొత్తానికి జగన్ మునిగినా.. తేలినా సజ్జల పుణ్యమేనని టాక్.. సజ్జల దెబ్బకు జగన్ నట్టేట మునుగుతాడో.. తెలుతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.




అనుమానితుల్లో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు 

Loading..