Advertisement

118 సీట్లతో టీడీపీ - జనసేన తొలి జాబితా

Sat 24th Feb 2024 12:47 PM
tdp  118 సీట్లతో టీడీపీ - జనసేన తొలి జాబితా
TDP-Janasena first list with 118 seats 118 సీట్లతో టీడీపీ - జనసేన తొలి జాబితా
Advertisement

టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదలైంది. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. పొత్తులో భాగంగా తమకు వచ్చిన 24 సీట్లలో 5 సీట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించగా.. తొలి జాబితాలో 95 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మొత్తంగా రెండు పార్టీలు కలిసి 99 స్థానాలతో జాబితాను విడుదల చేశాయి. టీడీపీ అభ్యర్థుల జాబితాను అధినేత చంద్రబాబు ప్రకటించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..  ఏపీ అభివృద్ధితో పాటు రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ వెల్లడించారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నానని పవన్ తెలిపారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో.. టీడీపీ ఓటు మనకు పడటం కూడా అంతే ముఖ్యమని పవన్ అన్నారు.

జగన్ సిద్ధం.. సిద్ధమని చావగొడుతున్నాడు..

ఎక్కువ సీట్లు తీసుకుని ఏదో చేయాలని తనకు లేదని పవన్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా వరకూ వైసీపీ కారణంగా రాష్ట్రం నష్టపోయిందని.. అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమైనట్టు తెలిపారు. బీజేపీ కోసం‌ కూడా కొన్ని సీట్లు కుదించుకున్నామన్నారు. గతంలో తనకు పది సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదన్నారు. జగన్ సిద్ధం.. సిద్ధమని చావ గొడుతున్నాడని... తాము తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తామన్నారు. ఈ రాక్షస రాజ్యాన్ని తరమికొట్టి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే టీడీపీ- జనసేన కలయిక లక్ష్యమని పవన్ అన్నారు.

టీడీపీ అభ్యర్థులెవరంటే..

ఇచ్ఛాపురం-  బెందాళం అశోక్

టెక్కలి -  కింజరాపు అచ్చెన్నాయుడు

ఆమదాలవలస -  కూన రవి కుమార్

రాజం (ఎస్సీ) -  కొండ్రు మురళీ మోహన్

కురుపాం (ఎస్టీ) - తొయ్యక జగదేశ్వరి

పార్వతీపురం (SC) -  విజయ్ బోనెల

సాలూరు (ఎస్టీ) - గుమ్మడి సంధ్యా రాణి

బొబ్బిలి-  RSVKK రంగారావు (బేబీ నయన)

గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం -  పుష్పపతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు

విశాఖపట్నం తూర్పు - వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖపట్నం వెస్ట్  - PGVR నాయుడు (గన్నబాబు)

అరకు లోయ (ST)  - సియ్యారి దొన్ను దొర

పాయకరావుపేట (ఎస్సీ) -  వంగలపూడి అనిత

నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు

తుని - యనమల దివ్య

పెద్దాపురం -  నిమ్మకాయల చిన్నరాజప్ప

అనపర్తి  - నల్లిమిల్లి  రామకృష్ణారెడ్డి

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

గన్నవరం (ఎస్సీ) -  సరిపెల్ల రాజేష్ కుమార్

కొత్తపేట -  బండారు సత్యానందరావు

మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ  - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట  - జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రు )

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు -  ఆరిమిల్లి రాధా కృష్ణ

ఏలూరు  - బడేటి రాధా కృష్ణ

చింతలపూడి (ఎస్సీ) -  సొంగా రోషన్

తిరువూరు (ఎస్సీ) -  కొలికపూడి శ్రీనివాస్

నూజివీడు -  కొలుసు పార్ధసారధి

గన్నవరం -  యార్లగడ్డ వెంకట్ రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన -  కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం  - కొల్లు రవీంద్ర

పామర్రు (ఎస్సీ) -  వర్ల కుమార రాజా

విజయవాడ సెంట్రల్ -  బోండా ఉమ

విజయవాడ తూర్పు -  గద్దె రామ్మోహనరావు

నందిగామ (ఎస్సీ)  - తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట -  శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

తాడికొండ (ఎస్సీ) -  తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి -  నారా లోకేష్

పొన్నూరు -  ధూల్లిపాళ్ల నరేంద్ర

వేమూరు (ఎస్సీ) -  నక్కా ఆనంద్ బాబు

రేపల్లె  - అనగాని సత్య ప్రసాద్

బాపట్ల -  వేగేశన నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు (ఎస్సీ) -  బర్ల రామాంజనేయులు

చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లె -  కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ  - జివి ఆంజనేయులు

మాచర్ల  - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

యర్రగొండేపాలెం (ఎస్సీ)  - గూడూరి ఎరిక్షన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

అద్దంకి  - గొట్టిపాటి రవి కుమార్

సంతనూతలపాడు (ఎస్సీ) -  బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్

ఒంగోలు  - దామచర్ల జనార్దనరావు

కొండెపి  -  డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి

కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

కావలి -  కావ్య కృష్ణా రెడ్డి

నెల్లూరు సిటీ  - పి.నారాయణ

నెల్లూరు రూరల్ -  కోటుంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు (ఎస్సీ) -  పాసం సునీల్ కుమార్

సూళ్లూరుపేట (ఎస్సీ)  - నెలవెల విజయశ్రీ

ఉదయగిరి -  కాకర్ల సురేష్

కడప  - మాధవి రెడ్డి

రాయచోటి  - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పులివెండ్ల -  మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

మైదుకూరు -  పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ  - భూమా అఖిల ప్రియారెడ్డి

శ్రీశైలం -  బుద్దా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు  - టీజీ భరత్

పాణ్యం  - గౌరు చరితారెడ్డి

నంద్యాల  - Nmd. ఫరూఖ్

బనగానపల్లె -  బీసీ జనార్దన్ రెడ్డి

డోన్  - కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

పత్తికొండ  - కేఈ శ్యామ్ బాబు

కోడుమూరు -  బొగ్గుల దస్తగిరి

రాయదుర్గం -  కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పి.కేశవ్

తాడిపత్రి -  జె. సి . అశ్మిత్ రెడ్డి

సింగనమల (SC)  - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణదుర్గం  - అమిలినేని సురేందర్ బాబు

రాప్తాడు  - పరిటాల సునీత

మడకశిర (SC)  - M E సునీల్ కుమార్

హిందూపురం -  నందమూరి బాలకృష్ణ

పెనుకొండ -  సవిత

తంబళ్లపల్లె -  జయచంద్రారెడ్డి

పీలేరు  - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి  - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు (SC) -  Dr V M థామస్

చిత్తూరు -  గురజాల జగన్ మోహన్

పలమనేరు  - ఎన్ అమరనాథ్ రెడ్డి

కుప్పం  - నారా చంద్రబాబు నాయుడు

జనసేన అభ్యర్థులెవరంటే..

తెనాలి - నాదెండ్ల మనోహర్

నెల్లిమర్ల - లోకం మాధవి

అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

కాకినాడ రూరల్ - పంతం నానాజీ 

TDP-Janasena first list with 118 seats:

TDP and Janasena announce first list of 118 seats

Tags:   TDP
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement