Advertisement

కేసీఆర్ ఢిల్లీ పర్యటన అందుకేనా?

Tue 20th Feb 2024 09:47 PM
kcr  కేసీఆర్ ఢిల్లీ పర్యటన అందుకేనా?
Is that why KCR visited Delhi? కేసీఆర్ ఢిల్లీ పర్యటన అందుకేనా?
Advertisement

రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులుండరని ఎవరన్నారో కానీ అది అక్షారాలా నిజం. ఎవరు ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకోవచ్చు. అవసరమైతే భాయి-భాయి అనవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ విషయం ఆసక్తికరంగా మారింది. అదేంటంటే.. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందట. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంత స్ట్రాంగ్ అయ్యిందా? ఈ రెండు పార్టీలకు కొరకరాని కొయ్యగా మారిందా? అనే డౌటానుమానం రాకమానదు. ఎక్కడున్న కాంగ్రెస్ ఎక్కడికి వెళ్లిపోయింది? నినజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఏదో మిరాకిల్ చేశారు. ఇక గెలిచాక ఊరుకుంటారా? బీఆర్ఎస్ చేసిన తప్పుల చిట్టాను వెదికి తీయడం మొదలు పెట్టారు. 

పొత్తుల గురించి నేరుగానే..

కాళేశ్వరం నుంచి మొదలు పెట్టి.. కరెంటు వరకూ ఎక్కడెక్కడ ఏమేం అవినీతి జరిగిందో లెక్క తీస్తున్నారు. ఇక అంతే నిన్న మొన్నటి వరకూ అధికారులు సహా ప్రతి ఒక్కరిని వణికించిన బీఆర్ఎస్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. అసెంబ్లీలో ఎదుర్కొన్న పరాభవాన్నే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎదుర్కోకూడదని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని టాక్. పొత్తుతో వెళితేనే కాంగ్రెస్‌కు మించి సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ భావిస్తోందట. ఈ క్రమంలోనే మల్లారెడ్డిలాంటి వాళ్లు అయితే.. డైరెక్ట్‌గానే పొత్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే పొత్తు ఉండదని చెబుతూనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఏకి పారేశారు. లక్ష్మణ్ మాటలు చూస్తుంటే పొత్తు ఉండదేమో అనిపిస్తోంది.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీస్తే..

ఈ క్రమంలోనే మరో ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఆయన హస్తినకు పయనమవుతున్నారు. అది లోక్‌సభ ఎన్నికలకు ముందుకు కావడంతో తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో పొత్తు విషయం తేల్చుకోవడానికే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని టాక్. ఒకవేళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కేసీఆర్ భేటీ అయ్యారంటే పొత్తు గురించేనని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీస్తే.. కనీసం 13 సీట్లు గెలవొచ్చనే అంచనాలు వినిపిస్తుండడంతో రెండు పార్టీలు పొత్తుకు మొగ్గు చూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సైతం కేంద్రంలో మరింత బలమైన పార్టీగా అవతరించాలంటే రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లు సాధించాలి కాబట్టి బీఆర్ఎస్‌తో పొత్తుకు సై అంటుందని టాక్.

Is that why KCR visited Delhi?:

If BRS and BJP contest together..

Tags:   KCR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement