Advertisementt

బేబమ్మ బెల్లీ డాన్స్

Sat 10th Feb 2024 01:57 PM
krithi shetty  బేబమ్మ బెల్లీ డాన్స్
Krithi Shetty belly dance viral బేబమ్మ బెల్లీ డాన్స్
Advertisement
Ads by CJ

బేబమ్మ కృతి శెట్టి ఉప్పెన తర్వాత తార జువ్వలా టాలీవుడ్ లో దూసుకుపోయింది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్స్ కొట్టడంతో కృతి శెట్టి బంగారు హ్యాండ్ అంటూ.. చెప్పినవారు, కష్టడి, వారియర్, మాచర్ల నియోజకవర్గం వరస డిజాస్టర్స్ కృతి శెట్టిని టాలీవుడ్ పక్కనపెట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ తో  చిత్రంలో నటిస్తుంది. అటు కృతి శెట్టికి తమిళం, కన్నడ చిత్రాల్లో మంచి ఆఫర్స్ వచ్చాయి. తమిళనాట కృతి శెట్టి LIC లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటిస్తుంది.

అయితే కృతి శెట్టి సోషల్ మీడియాకి ఎప్పుడూ కాస్త దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో కృతి శెట్టి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. మొన్నీమధ్యన నుంచి కృతి శెట్టి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా విజయ్ - పూజ హెగ్డే నటించిన బీస్ట్ చిత్రంలోని అరబిక్ కుత్తు సాంగ్ కి కృతి శెట్టి బెల్లీ డాన్స్ చేస్తూ ఇరగదీసింది. అటు గ్లామర్ గా కనిపిస్తూ కృతి శెట్టి చేసిన డాన్స్ అందరూ మాట్లాడుకునేలా చేసింది. బేబమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ షాకైపోతున్నారు.

Krithi Shetty belly dance viral:

Krithi Shetty belly dance goes viral

Tags:   KRITHI SHETTY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ