Advertisement

ఇంకా ఊరటలభించని చంద్రబాబు కేసు

Tue 16th Jan 2024 06:29 PM
chandrababu  ఇంకా ఊరటలభించని చంద్రబాబు కేసు
Chandrababu ఇంకా ఊరటలభించని చంద్రబాబు కేసు
Advertisement

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది. అయితే కేసులో రిమాండ్‌ విధించే అధికారం విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని తేల్చి చెప్పింది. అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్‌ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. దాంతో చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్‌ పిటిషన్‌ను బదిలీ చేసింది. ఓవరాల్‌గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చుక్కెదురే.

జస్టిస్‌ బోస్‌ తీర్పు చూస్తే.. ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా బాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు. 

జస్టిస్‌ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. 17-A అంశాన్ని చీఫ్ జస్టిస్ వద్దకు తీసుకెళ్లనున్న ద్విసభ్య ధర్మాసనం, దీంతో కేసులో మళ్లీ మెలిక.. ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందన్న దాని పై సస్పెన్స్ నడుస్తూనే ఉంది.

 

Chandrababu :

AP Skill Case 

Tags:   CHANDRABABU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement