ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి, అందులో చాలావరకు హిట్ అయితే ఎక్కడో ఒకటి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేక సైలెంట్ అవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు బాక్సాఫీసు వార్ కి దిగాయి. చిన్న, పెద్ద, మీడియం సబ్జెక్టు లతో వచ్చిన సినిమాల్లో ఈ బరి నుంచి రవితేజ ఈగల్ సినిమాని తప్పించారు. మరో సినిమా హనుమాన్ ని సంక్రాంతి బరి నుంచి తప్పుకోమని ఒత్తిళ్లు. మహేష్ బాబు నటించిన గుంటురు కారం లాంటి క్రేజీ సినిమా.. ఆ తర్వాత వెంకటేష్ కేరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే మూవీ సైంధవ్, భారీ గ్యాప్ తో నాగార్జున సంక్రాంతికి సందడికి రెడీ అవడం, ఇలా ఈసారి సంక్రాంతి చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.
జనవరి 12 న గుంటూరు కారం, అదే రోజు తేజ సజ్జ హనుమాన్ విడుదలయ్యాయి. అందులో మహేష్ గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ రావడము, విమర్శకుల సైతం గుంటూరు కారం కి మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. అదే రోజు విడుదలైన హనుమాన్ ముందు రోజే ప్రీమియర్స్ వేసుకుని తన స్టామినా చూపించింది. హనుమాన్ కి ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతమవడంతో పాటుగా పాజిటివ్ రివ్యూస్ వచ్చేసాయి. దానితో సోషల్ మీడియా మొత్తం హనుమాన్ మాటే వినిపించింది.
ఇక జనవరి 13 న వెంకటేష్ సైంధవ్ విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. సైంధవ్ పండగ సినిమా కాదని తేల్చేసారు. కనీసం యావరేజ్ టాక్ కూడా సైంధవ్ సొంతం చేసుకోలేకపోయింది. ఆ చిత్రం వెంకీకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రిజల్ట్ ఇస్తుంది అనుకుంటే డిస్పాయింట్ చేసింది. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున నా సామిరంగ భోగి రోజున కయ్యానికి కాలు దువ్వింది. జనవరి 14 న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు నా సామిరంగ కి ఓటు వేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి కూడా క్రిటిక్స్ యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు.
ఇక ఈ పొంగల్ విన్నర్ గా చిన్న చిత్రమన్న హనుమాన్ నిలిచింది. ప్రేక్షకులే హనుమాన్ అద్భుతమైన సినిమా అని, సంక్రాంతి పండగ విన్నర్ అని డిసైడ్ చేసారు. అందుకే హనుమాన్ కలెక్షన్స్ రోజు రోజుకి పుంజుకుంటున్నాయి. కేవలం ప్రేక్షకులే కాదు సోషల్ మీడియాలోనూ ఇదే మాట వినిపిస్తుంది.
2024 : Conclusion
1st Place : #HanuMan
2nd place: #NaaSaamiRanga
3rd Place : #Saindhav
4th Place : #GunturKaaram




 
                     
                      
                      
                     
                     లక్కీగా ఎస్కేప్ అయిన పూజా హెగ్డే
 లక్కీగా ఎస్కేప్ అయిన పూజా హెగ్డే

 Loading..
 Loading..