Advertisementt

ప్రభాస్ కన్నా పృథ్విరాజ్ బెటర్

Thu 21st Dec 2023 11:54 AM
prithviraj,prabhas  ప్రభాస్ కన్నా పృథ్విరాజ్ బెటర్
Prithviraj is better than Prabhas ప్రభాస్ కన్నా పృథ్విరాజ్ బెటర్
Advertisement
Ads by CJ

రేపు శుక్రవారమే సలార్ రాక.. కానీ ప్రమోషన్స్ విషయంలో చెప్పలేనంత వీక్. అయినా ప్రభాస్ అభిమానులు సలార్ పై హైప్ క్రియేట్ చేసే పనిలో చాలా బిజీగా వున్నారు. అయితే క్రేజ్ లేదు లేదు అంటూనే సలార్ బుకింగ్స్ ఓపెన్ కాగానే.. భీభత్సమైన అలజడి కనిపించింది. సలార్ ఓపెనింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం. అయితే సలార్ విషయం లో ప్రభాస్ చాలా లైట్ గా వున్నారు. రాజమౌళితో ఓ కామన్ ఇంటర్వ్యూ తప్ప సలార్ ని ప్రభాస్ పట్టించుకోలేదనే విమర్శ ఉంది.

సలార్ చిత్రంలో నటించిన విలన్ పాత్రధారి పృథ్వీ రాజ్ సుకుమారన్ మాత్రం సలార్ ప్రమోషన్ బాధ్యతలను భుజాల మీద మోస్తున్నారు. సలార్ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా పృథ్వీ రాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. సలార్ అప్ డేట్ కోసం పృథ్వీ రాజ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. హీరో ప్రభాస్ మాత్రం కనీసం సలార్ పై సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా చెయ్యడం లేదు.

అది చూసిన కొంతమంది సలార్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ కన్నా పృథ్వీ రాజే బెటర్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.

Prithviraj is better than Prabhas:

Salaar Promotions: Prithviraj Sukumaran is better than Prabhas

Tags:   PRITHVIRAJ, PRABHAS
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ