Advertisement

తిరుమల హుండీని ఏటీఎంలా దోచేస్తున్నారు

Thu 14th Dec 2023 05:42 PM
tirumala tirupati devasthanam  తిరుమల హుండీని ఏటీఎంలా దోచేస్తున్నారు
Tirumala Hundi is being robbed like an ATM తిరుమల హుండీని ఏటీఎంలా దోచేస్తున్నారు
Advertisement

శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశ గోవిందా.. అని పాడుకోవడం మానేసి ఇప్పుడు తిరుమల హుండీ గోవిందా.. శ్రీవారి ఆదాయం గోవిందా అని పాడుకోవాల్సి వస్తోంది. అసలు ఏపీ సీఎం జగన్‌కు హిందూ దేవతల ఆరాధన ఏమాత్రం లేదు కేవలం ఏసయ్య ఆరాధనే. రాష్ట్రంలో సంక్షేమానికి నిధులతో పాటు అప్పులు తెచ్చి మరీ పెట్టడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. మరి రాష్ట్రంలో మౌలిక వసతుల నిర్వహణ మాటేంటి? ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కదా. దాని కోసం ప్రజల నుంచి పన్నులు పెద్ద ఎత్తున వసూలు చేస్తూనే ఉంది. కానీ అవన్నీ ఎటు పోతున్నాయో తెలియదు.

రూ.100 కోట్లు లేపేసింది..

తాజాగా వైసీపీ ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమానికి తెరదీసింది. తిరుపతి పట్టణంలో రోడ్ల నిర్మాణం, పారిశుధ్య పనుల కోసం ఏకంగా శ్రీవారి హుండీకే కన్నం పెట్టేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకొన్న శ్రీవారి హుండీ ఆదాయం నుంచి రూ.100 కోట్లు లేపేసింది వైసీపీ ప్రభుత్వం. వాటిని తిరుపతి కార్పొరేషన్‌కి ఇచ్చేసింది. అంతటితో ఆగితే బాగానే ఉండేది. తిరుమల హుండీని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకునేలా ప్లాన్ చేసింది. మొత్తానికి తిరుమల శ్రీవారి హుండీని ఏటీఎంని చేసేసింది.

ఒక శాతం నిధుల మాట ఎత్తదనేంటి?

అలాగే టీటీడీ బడ్జెట్‌లో నిధులను సైతం వాడుకోవాలని స్కెచ్ గీసింది. ఇక మీదట తిరుపతి కార్పొరేషన్‌కు ఒక శాతం ఇవ్వాలని పాలక మండలి తీర్మానించింది. విపక్షాల నుంచి సామాన్య ప్రజానీకం వరకూ దీనిపై ఫైర్ అయ్యారు. విమర్శలు వెల్లువెత్తాయి. దెబ్బకు వెనుకడుగు వేసింది. కానీ వంకర బుద్ది అంత కామ్‌గా ఉండదుగా.. యవ్వారం సద్దుమణగగానే.. మళ్లీ ఒక శాతం నిధులు మాట ఎత్తదనేంటి? అందుకే బీజేపీ నేత ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల ఆదాయం దారి మళ్లించవద్దని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే.. వైసీపీ ప్రబుత్వం శ్రీవారి హుండీతో ఆగుతుందా? లేదంటే రేపటి రోజున అన్ని ప్రధాన దేవాలయాల హుండీలను హరీమనిపిస్తుందా? దీనికి పరిష్కారం ఆ గోవిందుడే చూడాలి. 

Tirumala Hundi is being robbed like an ATM:

Tirumala Tirupati Devasthanam

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement