ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 7: Sobha Shetty Evicted

BB7 : హమ్మయ్య ఎలిమినేట్ అయ్యింది

బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ నటి శోభా శెట్టి నామినేషన్స్ లో తన విలనిజం అంటే కార్తీక దీపం సీరియల్ లో మోనితలా బిహేవ్ చేసేది అనే కొంతమంది కంటెస్టెంట్స్ మాటని నిజం చేసింది. మూడో  వారం నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యావర్ ని పదే పదే టార్గెట్ చేస్తూ అతను చివరి వారం వచ్చేవరకు ఆటలో వీక్ అయ్యేలా చేసింది. అలాగే శివాజీకి టార్గెట్ గా మారింది. ఒక్కోసారి శోభా శెట్టి అరుపులతో కంటెస్టెంట్స్ చాలామంది డిస్టర్బ్ అయ్యేవారు.. ముఖ్యంగా అర్జున్ చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్పాడు.

అమర్ దీప్ ని కాపాడే క్రమంలో తన ఆటని పక్కనబెట్టిన శోభా శెట్టి మాటల విషయంలో హైలెట్ అయ్యి టాస్క్ ల విషయంలో వీకైంది. ప్రియాంక తో పాటుగా ఆడాల్సిన శోభా శెట్టి ఆటలో ఓడిపోయింది. బయట నెటిజెన్స్ కూడా శోభా శెట్టి పై నెగిటివిటీ చూపిస్తున్నారు. శివాజీ అయితే ఏకంగా ఇలాంటి అమ్మాయిలని పెళ్లికి చేసుకోవాలంటే భయపడాలంటూ స్టేట్మెంట్ పాస్ చేసాడు. ఇక చివరి వారంలో శోభా శెట్టి ఫౌల్ గేమ్ ఆడడమే కాదు, యావర్ విషయంలో చేసిన తప్పుకి నాగార్జున చివాట్లు కూడా పెట్టారు.

ఇక 14 వారాలుగా భరించిన శోభాశెట్టిని స్టార్ మా యాజమాన్యం కావాలనే సేవ్ చేస్తుంది. బిగ్ బాస్ ముద్దు బిడ్డ, సీరియల్ స్టార్ శోభా ని కాపాడుతున్నారంటూ గోల చేస్తున్నారు బయట జనాలు. అయితే ఆమెని టాప్ 5 కి పంపేస్తారేమో అనుకున్నారు. కానీ ఈ వారం శోభా శెట్టి ఫైనల్ గా ఎలిమినేట్ అవడంతో హౌస్ లో శివాజీ ఊపిరి పీల్చుకుంటే, కొంతమంది నెటిజెన్స్ అయితే హమ్మ ఇన్నాళ్ళకి ఎలిమినేట్ అయ్యింది శోభా శెట్టి అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Bigg Boss Telugu 7: Shobha Shetty Is Evicted

Bigg Boss Telugu 7: Sobha Shetty Evicted
shobha shetty