Advertisementt

యానిమల్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Sat 02nd Dec 2023 02:33 PM
ranbir kapoor,animalott platform  యానిమల్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Animal OTT Partner Revealed యానిమల్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం డిసెంబర్ 1 న భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన రణబీర్ కపూర్ యానిమల్ మూవీకి ఓవరాల్ గా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. యూత్ ని టార్గెట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ ఆ యూత్ కి బాగా నచ్చేయ్యడంతో సోషల్ మీడియాలో హిట్ టాక్ బాగా వైరల్ గా మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ అంతా యానిమల్ ని పొగిడేశారు. రణబీర్ యాక్టింగ్ కి, సందీప్ డైరెక్షన్ కి అందరూ పడిపోయారు.

మరి థియేటర్స్ లో ఇంత పెద్ద హిట్ గా నిలిచిన యానిమల్ ఏ ఓటిటిలో వస్తుందో అనే ఆత్రుత ఇప్పుడు ఓటిటీ ఆడియన్స్ లో మొదలైంది. థియేట్రికల్ రన్ ముగియగానే యానిమల్ మూవీ ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టుగా మేకర్స్ టైటిల్ కార్డ్స్ లోనే రివీల్ చేసారు. యానిమల్ మూవీకి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ డీల్ తో చేజిక్కించుకుంది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి ఈచిత్రం ఐదారు వారాల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం.  

Animal OTT Partner Revealed:

Ranbir Kapoor Film To Stream On THIS OTT Platform

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ