Advertisementt

అందుకే రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది

Wed 29th Nov 2023 10:50 AM
sreeleela  అందుకే రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది
Sreeleela replaces Rashmika Mandanna అందుకే రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది
Advertisement
Ads by CJ

టాలీవుడ్ బిజీ తార శ్రీలీల గత మూడు నెలలుగా సినిమా షూటింగ్స్, అలాగే ప్రమోషన్స్ ఈవెంట్స్ అంటూ మీడియా ముందే కనిపిస్తుంది. స్కంద, భగవంత్ కేసరి, ఆది కేశవ, ఇప్పుడు నితిన్ తో నటించిన ఎక్సట్రార్డినరీ మ్యాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో శ్రీలీల బాగా బిజిగా కనబడుతుంది. అందులో భాగంగానే శ్రీలీల రవితేజ, విజయ్ దేవరకొండ చిత్రాల నుంచి తప్పుకుంది అన్నారు. అలా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకుంటే శ్రీలీల ప్లేస్ లోకి రష్మిక వచ్చేసింది అంటూ గుసగుసలాడారు.

అయితే శ్రీలీల ప్లేస్ లోకి రష్మిక రావడం కాదు.. రష్మిక తప్పుకున్న చిత్రంలోకి ఇప్పుడు శ్రీలీల వచ్చి చేరింది. ఈమధ్యన రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక నితిన్-వెంకీ కుడుములు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అనే ప్రచారం జరిగింది. అది నిజమే అంటూ ఎక్సట్రార్డినరీ ప్రమోషన్స్ లో నితిన్ చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉంది. సౌత్ హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అలా రష్మిక మా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు శ్రీలీల అయితే తమ సినిమాలోని హీరోయిన్ సరిగ్గా సరిపోతుందని నా దర్శకుడు వెంకీ కుడుములు అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం ఎక్సట్రార్డినరీలో కలిసి పని చేసిన శ్రీలీలతో మరోసారి వర్క్ చెయ్యడం చాలా బాగుంది.. అంతేకాకుండా శ్రీలీల తెలుగమ్మాయి అవడం మరో ప్లస్ పాయింట్ అంటూ నితిన్ రష్మిక తమ ప్రాజెక్ట్ నుంచి ఎలా, ఎందుకు తప్పుకుందో.. ఆ ప్లేస్ లోకి శ్రీలీల ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు.

Sreeleela replaces Rashmika Mandanna:

Sreeleela Replaces Rashmika Mandanna in Nithin And Venky Movie

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ